Hamas: “మహిళల్ని చుట్టుముట్టి ఒకరు రేప్ చేస్తుంటే, మిగతా వాళ్లు నవ్వారు”.. వెలుగులోకి హమాస్ అకృత్యాలు..

Hamas: హమాస్ ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 7 నాటి దాడి సమయంలో మహిళలపై హమాస్ ఉగ్రవాదులు అత్యాచారాలకు పాల్పడుతూ, వారిని హత్యలు చేశారు. చిన్న పెద్దా, ముసలి వారనే తేడా లేకుండా హత్యలు చేశారు. చిన్న పిల్లల తలలను వేరు చేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఆ దాడి సమయంలో జరిగిన సంఘటనల గురించి ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. సీఎన్ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బందీల్లో ఒకరైన రాజ్ కోహెన్ హమాస్ ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని వెల్లడించారు.
‘‘ఐదుగురు వ్యక్తులు వ్యాన్ నుంచి బయటకు వచ్చి ఒక మహిళను బంధించారు. ఆమె చుట్టూ నిలబడి, మహిళ బట్టల్ని చించేశారు, అందులో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమెను కత్తి పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత కూడా ఆమెపై రేప్‌కి పాల్పడ్డారు. బాధితురాలి చుట్టూ ఉన్న ఇతర హమాస్ ఉగ్రవాదులకు ఏమాత్రం బాధగా లేదు. వారు నవ్వూతూ, వినోదంగా చూశారు. సరదా కోసం చాలా మందిని హత్య చేశారు’’ అని ఆయన అన్నారు.
Read Also: Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి మూవీ అల్లు అర్జున్ తో చేద్దామనుకున్నా కానీ విజయ్ తో తీశా..
బాధిత మహిళ తన స్నేహితుడితో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో హత్యకు గురైందని కోహెన్ చెప్పారు. మరో యువతి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె తలలో కాచ్చి చంపారని, ఇవన్ని కోహెన్ ఒక పొదలో దాక్కుని చూశానని చెప్పాడు. దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంలో జరిగే నోవా సంగీత కార్యక్రమానికి తన ప్రేయసి మాయతో కలిసి రాజ్ కోహెన్ వెళ్లాడు. ఆ సమయంలోనే హమాస్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
మహిళపై హమాస్ మిలిటెంట్ల అత్యాచారం తర్వాత, ఆ టీం మరో వ్యక్తిని, మరొక మహిళను వెంబడించి, కత్తులు, గొడ్డళ్లతో పొడిచి చంపినట్లు తెలిపాడు. తన ప్రాణాలను రక్షించుకునేందుకు ఎడాది ప్రాంతంలో పరిగెత్తానని, కాల్పుల్లో చిక్కుకున్నట్లు అనిపించిందని, దాక్కోవడానికి తనకు చోటు కూడా లభించలేదని, ఇరు పక్కట నుంచి బుల్లెట్ల వర్షం కురిసిందని భయానక అనుభవాన్ని తెలిపారు. నేను ఇలా పరిగెత్తుతున్న సమయంలోనే ఒక అమ్మాయిని కాల్చి చంపారని, నేను ఆమెకు సాయం చేయలేకపోయానని, సమీప పొదల్లో దాక్కున్నట్లు తెలిపాడు. చాలా మంది మహిళలు వివస్త్రలుగా ఉన్నట్లు ఈ భయానక ఘటనలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.