
పాకిస్థాన్ ప్రజలు మరోసారి ద్రవ్యోల్బణం భారాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ లో ధరలకు సంబందించిన వివరాలను లాహోర్‌లో పాక్ ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా డజను గుడ్ల ధర మార్గెట్ లో 400 పాకిస్తానీ రూపాయలకు (పీకేఆర్) చేరుకుందని తెలిపారు.
అలాగే, పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా రేట్ల జాబితాను విడుదల చేసినా స్థానిక యంత్రాంగం సక్రమంగా అమలు చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన కిలో 175 ధరకు వ్యతిరేకంగా కిలో ఉల్లిని 230 నుంచి 250 రూపాయల మధ్య విక్రయిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. లాహోర్‌లో డజను కోడిగుడ్ల ధర పీకేఆర్ 400కి చేరుకోగా.. అక్కడ చికెన్ కిలోగ్రాము పీకేఆర్ 615 చొప్పున విక్రయిస్తున్నారు. గత నెలలో ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ (ECC) జాతీయ ధరల పర్యవేక్షణ కమిటీ (NPMC) ధరల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అలాగే, హోర్డింగ్ తో పాటు లాభదాయకతను నిరోధించే చర్యల కోసం ప్రాంతీయ ప్రభుత్వాలతో క్రమం తప్పకుండా సమన్వయం కొనసాగించాలని ఆదేశించింది. పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉటంకిస్తూ.. క్యాబినెట్ కమిటీ సమావేశానికి ఆర్థిక, రెవెన్యూతో పాటు ఆర్థిక వ్యవహారాల తాత్కాలిక సమాఖ్య మంత్రి శంషాద్ అక్తర్ అధ్యక్షత వహించినట్లు తెలుస్తుంది.