Leading News Portal in Telugu

Iran’s strikes in Pakistan: “ఆత్మరక్షణ కోసమే”.. పాకిస్తాన్‌పై ఇరాన్ దాడి.. భారత్ స్పందన..


Iran’s strikes in Pakistan: “ఆత్మరక్షణ కోసమే”.. పాకిస్తాన్‌పై ఇరాన్ దాడి.. భారత్ స్పందన..

Iran’s strikes in Pakistan: పాకిస్తాన్‌పై ఇరాన్ దాడి చేసింది. బలూచిస్తాన్ లోని కీలమైన రెండు ప్రాంతాలపై వైమానికి దాడులకు పాల్పడింది. దీనిపై భారత్ స్పందించింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయమని, ఉగ్రవాదం పట్ల ఇరాన్ స్పందించిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు భారత్ అర్థం చేసుకుంటుందని తెలిపింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ వైఖరిని భారత్ మరోసారి నొక్కి చెప్పింది.


ఇరాన్ బుధవారం డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ లోని సున్నీ బలూచీ టెర్రర్ గ్రూపు జైష్ అల్ అద్ల్-ఆర్మీ ఆఫ్ జస్టిన్ రెండు స్థావరాలను ధ్వసం చేసింది. ఈ ఉగ్రవాదులు గతంలో పాక్ సరిహద్దుల్లోనే ఇరాన్ భద్రతా బలగాలపై దాడులు చేసింది. డిసెంబర్ 15న జైష్ అల్-అద్ల్ కార్యకర్తలు మరో పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతో 11 మంది పోలీసు అధికారులు మరణించారు.

‘‘మేము పాకిస్తాన్ గడ్డపై ఇరాన్ ఉగ్రసంస్థల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాము. మేము పాకిస్తాన్ పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని మరియు ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాము, కానీ జాతీయ భద్రతతో రాజీ పడటానికి అనుమతించము’’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ అన్నారు. ఇదిలా ఉంటే తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నట్లు, పర్యవసానాలకు పూర్తి బాధ్యత ఇరాన్‌దే అని పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ మాట్లాడుతూ, ఉగ్రవాదం ఈ ప్రాంతానికి సాధారణ ముప్పు అని.. దానిని ఎదుర్కోవడానికి సమన్వయ ప్రయత్నాలు అవసరమని.. ఏకపక్ష చర్యలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని చెప్పారు. అంతకుముందు ఇరాన్ సిరియా, ఇరాక్‌పై ఇలాగే దాడులు చేసింది.