Leading News Portal in Telugu

China: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది మృతి


China: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది మృతి

Fire Accident: చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ఓ స్కూల్ హాస్టల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 13 మంది మరణించారు. కాగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.. హెనాన్‌లోని యన్‌షాన్‌పు గ్రామంలోని యింగ్‌కై స్కూల్‌లో శుక్రవారం రాత్రి 11 గంటలకు మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకిని మంటలను ఆర్పివేసినట్లు తెలిపింది.


అయితే, ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. అలాగే, ఈ సంఘటనకు సంబంధించిన కేసులో పాఠశాల హెడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమదం జరిగినట్లు తెలుస్తుంది. ఇక, గత ఏడాది నవంబర్‌లో ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని బొగ్గు కంపెనీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోయారు. అదే సమయంలో, పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రిలో చేరారు. గతేడాది ఏప్రిల్‌లో బీజింగ్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 29 మంది మృతి చెందగా, చాలా మంది కిటికీల్లోంచి కిందకి దూకి తీవ్రంగా గాయపడ్డారు.