Leading News Portal in Telugu

Houthi Rebels: ఎర్ర సముద్రంలో మరోసారి హౌతీ రెబల్స్ దాడి


Houthi Rebels: ఎర్ర సముద్రంలో మరోసారి హౌతీ రెబల్స్ దాడి

ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై గురువారం నాడు హౌతీ తిరుగుబాట దారులు దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై రెండు బాలిస్టిక్‌ క్షిపణులను యెమెన్‌లోని హూదేదా నుంచి రెబల్స్ ప్రయోగించినట్లు తెలిపింది. నౌక, అందులోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు.. ఆ రెండు క్షిపణులు నౌకకు సమీపంలో పేలాయని అమెరికా ప్రకటించింది.


అలాగే, హౌతీ తిరుగుబాటుదారులు మంగళవారం అర్థరాత్రి ఎర్ర సముద్రంలోకి క్షిపణిని ప్రయోగించారు. ఇందులో యూఎస్ఎస్ గ్రేవ్లీ క్షిపణిని ధ్వంసం చేయడానికి క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ ని ఉపయోగించారు. అంతకుముందు జనవరి 11న యెమెన్‌లోని హౌతీలపై అమెరికా అనేక దాడులు చేసింది.. అందులో తిరుగుబాటుదారుల ఆయుధాలు ధ్వంసమయ్యాయని US సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీని తరువాత, హౌతీ రెబల్స్ కు ఇరాన్ నిరంతరం ఆయుధాలను సరఫరా చేసింది.. దీనికి సంబంధించి US నావికాదళం ఇటీవల సోమాలియా తీరంలో హౌతీల దగ్గర నుంచి ఇరాన్‌లో తయారు చేసిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను స్వాధీనం చేసుకుంది. సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఇది ప్రపంచ దేశాల మధ్య దాడులకు ప్రేరేపించే చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.