Leading News Portal in Telugu

Maldives- India: ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాలని మాల్దీవుల ప్రతిపక్ష పార్టీల నిర్ణయం..


Maldives- India: ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాలని మాల్దీవుల ప్రతిపక్ష పార్టీల నిర్ణయం..

భారత్‌తో ఉద్రిక్తత నేపథ్యంలో మాల్దీవుల్లో కూడా రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. దేశంలోని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు – మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ, డెమొక్రాట్స్ పార్టీలు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. అందులో భాగంగానే ముయిజ్జూ ఇవాళ రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. పార్లమెంటులో మెజారిటీ ఉన్న MDP బహిష్కరణకు గల కారణాన్ని ఇంకా వెల్లడించలేదు..


అయితే, పార్లమెంటు తిరస్కరించిన ముగ్గురు మంత్రులను తిరిగి నియమించడం వల్ల ఈ రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉన్నారని డెమొక్రాట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక, ఈ ఏడాది మాల్దీవుల పార్లమెంట్‌లో ఇది తొలి సమావేశం. అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి పార్లమెంటరీ సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి భారత వ్యతిరేక వైఖరిపై ఇటీవల రెండు ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.

ఇక, మల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై ఇటీవల మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ, డెమొక్రాట్స్ పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. కీలకమైన హిందూ మహాసముద్రంలో భారత్‌, చైనా తమ వ్యూహాత్మ ప్రాధాన్యపై దృష్టి పెట్టింది. మాల్దీవుల మంత్రులు, లక్షద్వీప్ విషయంలో ప్రధాని మోడీపై అనుచిత​ వ్యాఖ్యలు చేయటంతో చైనా అనుకూల వ్యక్తిగా పేరున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జతో భారత్‌ దౌత్యపరమైన సంబంధాలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి.