Leading News Portal in Telugu

Imran Khan: ఎన్నికల వేళ ఇమ్రాన్‌ఖాన్‌‌కు బెయిల్


Imran Khan: ఎన్నికల వేళ ఇమ్రాన్‌ఖాన్‌‌కు బెయిల్

పాకిస్థాన్ (Pakistan) సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీలు ఎవరికి వారే విజయం సాధించామంటూ చెప్పుకుంటున్నారు.


ఇదిలా ఉంటే ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా ఇమ్రాన్‌ఖాన్‌కు (Imran Khan) కోర్టులో ఊరట లభించింది. ఆర్మీ ఆస్తుల ధ్వంసం సంబంధించిన వాటిలో ఆయనకు 12 కేసుల్లో బెయిల్ లభించింది.

గత ఏడాది మేలో సైనిక స్థావరాలపై దాడులకు సంబంధించిన 12 కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.