Leading News Portal in Telugu

Texas Megachurch: టెక్సాస్‌ మెగాచర్చిలో కాల్పులు.. మహిళను కాల్చి చంపిన పోలీసులు!


Texas Megachurch: టెక్సాస్‌ మెగాచర్చిలో కాల్పులు.. మహిళను కాల్చి చంపిన పోలీసులు!

Woman Fire in Texas Megachurch: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. టెక్సాస్‌ హూస్టన్‌లో ఉన్న మెగాచర్చిలో ఆదివారం ఓ మహిళ తుపాకీతో కాల్పులకు పాల్పడింది. వేంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు, 57 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం…


స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐదేళ్ల బాలుడితో ఓ మహిళ లాక్‌వుడ్ చర్చిలోకి ప్రవేశించింది. తాను ధరించిన ట్రెంచ్‌కోట్‌లో నుంచి పొడవాటి తుపాకీని తీసి.. ప్రార్థనలు చేస్తున్న వారిపై ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించింది. దీంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఉన్న ఇద్దరు భద్రతా పోలీసులు ఎదురు కాల్పులు జరపటంతో ఆ మహిళ మృతిచెందింది. ఆమెతో వచ్చిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో 57 ఏళ్ల వ్యక్తి గాయపడ్డాడు.

బాలుడు పిల్లల ఆసుపత్రిలో ఉన్నాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని హ్యూస్టన్ పోలీస్ చీఫ్ ట్రాయ్ ఫిన్నర్ తెలిపారు. మరో వ్యక్తి తుంటి గాయంతో వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. కాల్పులు జరిపిన మహిళను గుర్తించే పనిలో ఉన్నట్లు ఫిన్నర్‌ తెలిపారు. మహిళతో ఆ బాలుడికి ఏ సంబంధం ఉంది, ఆమె ఎందుకు కాల్పులు జరిపిందనే అంశంపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఫిన్నర్‌ పేర్కొన్నారు. ప్రతి వారం 45000 మంది ప్రజలు మెగాచర్చ్‌లోని ప్రార్థనల్లో పాల్గొంటారటని, 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగితే మరింత దారుణంగా ఉండేదనిన్నారు. అమెరికాలో మూడవ అతిపెద్ద మెగాచర్చ్‌.