
Narendra Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) లో పర్యటించనున్నారు. యూఏఈలోని అబుదాబిలో కొత్తగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని రేపు ఆయన ప్రారంభించనున్నారు. అయితే, అంతకుముందు ఇవాళ అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి అహ్లాన్ మోడీ అని పేరు పెట్టారు. ప్రధానమంత్రి ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు కూడా జరగే అవకాశం ఉంది.
ఇక, ప్రధాని మోడీ ఇవాళ ఉదయం 11.30 గంటలకు అబుదాబికి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు అబుదాబికి చేరుకుంటారు. ఇక, సాయంత్రం 4 ఉంచి 5.30 గంటల వరకు అబుదాబిలో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఈ ద్వైపాక్షిక భేటీలో ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఓడరేవుల రంగాలలో సహకారంపై ఒప్పందం కుదుర్చుకునే ఛాన్స్ ఉంది. అలాగే, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు అహ్లాన్ మోడీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యూఏఈ టూర్ తరువాత ఖతార్ కు రేపు ప్రధాని మోడీ బయల్దేరి వెళ్తారు. దోహాలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. నావి మాజీ అధికారులను విడుదల చేసినందుకు ప్రధాని మోడీ ఖతార్‌కు కృతజ్ఞతలు తెలిపనున్నారు.
అయితే, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, పూర్తి గ్రౌండ్ రిహార్సల్‌కు రెండున్నర వేల మందికి పైగా హాజరుకానున్నారు. రేపు అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ BAPS ఆలయం 27 ఎకరాల్లో నిర్మించారు.. ప్రధాని మోడీ పర్యటనకు ముందు స్వామినారాయణ ఆలయ వీడియోను రిలీజ్ చేశారు. 108 అడుగుల ఎత్తైన ఈ ఆలయం హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంది.