
భారతీయులకు (Indians) సౌదీ అరేబియా (Saudi Arabia Announces) హజ్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారతీయులకు (Indian Expats) ఉద్యోగాలను ప్రకటించింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (CGI) రాబోయే హజ్ సీజన్ కోసం 1445 మంది భారతీయు నిరుద్యోగులకు అవకాశం కల్పించింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్లర్కులు, డ్రైవర్లు మరియు మెసెంజర్ల తాత్కాలిక ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
18 సంవత్సరాలు నుంచి అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మార్చి 14 చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.
అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లను అవసరమైన పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది. మక్కా మరియు మదీనాలలో నివసించే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. హజ్ సెక్షన్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, POBox.No. 952, జెడ్డా-21421కు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
జీతం…
డేటా ఎంట్రీ ఆపరేటర్లు/క్లార్క్- నెలకు 3,600 సౌదీ రియాల్స్ (రూ. 79,747)
డ్రైవర్లు- నెలకు 2,880 సౌదీ రియాల్స్ (రూ. 63,798)
మెసెంజర్లు- నెలకు 1,980 సౌదీ రియాల్స్ (రూ. 43,861)
అర్హత
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు ఒక భారతీయ భాషతో పాటు అరబిక్ భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులకు క్లర్క్‌ల పోస్ట్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుండి కంప్యూటర్ అప్లికేషన్లో డిప్లొమా/సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ప్రాధాన్యత ఇవ్వబడతారు.
కావాల్సిన పత్రాలు..
చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కాపీ
విద్యా ధృవీకరణ పత్రాల కాపీ
రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
డ్రైవింగ్ లైసెన్స్ (డ్రైవర్ల విషయంలో మాత్రమే)