Leading News Portal in Telugu

Australia PM: సెకండ్ మ్యారేజ్ కి సిద్ధమైన ఆస్ట్రేలియా ప్రధాని.. ఎంగేజ్మెంట్ అయిపోయిందట..!


Australia PM: సెకండ్ మ్యారేజ్ కి సిద్ధమైన ఆస్ట్రేలియా ప్రధాని.. ఎంగేజ్మెంట్ అయిపోయిందట..!

Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్ మరోసారి పెళ్లి చేసుకునేందు రెడీ అయ్యాడు. జోడీ హైడన్ తో తన ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని అతడు అధికారికంగా వెల్లడించారు. ఈ మేర‌కు జోడీ హైడెన్‌తో సెల్ఫీ దిగిన ఫోటోను ఆంథోని తన ట్విట్టర్ ( ఎక్స్ ) అకౌంట్ లో షేర్ చేశారు. దీనికి ఆమె అంగీకారం తెలిపింది అంటూ ఆంథోని పోస్టులో తెలియజేశాడు. మ‌రోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆంథోనికి అధికార‌, ప్రతిపక్ష నేతలు విషెస్ తెలియజేస్తున్నారు. పదవిలో ఉండగా ఓ ప్రధాన మంత్రి పెళ్లి చేసుకోవడం ఆస్ట్రేలియాలో ఇదే తొలిసారి.


అయితే, 2020లో మెల్‌బోర్న్‌లో జ‌రిగిన బిజినెస్ డిన్నర్ లో తొలిసారి జోడి హైడెన్ ను ప్రధాని అల్బనీస్ ఆంథోని కలిశారు. అక్కడ ఏర్పాడిన పరిచయం ప్రేమగా మారడంతో గ‌త నాలుగేళ్ల నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 2022లో జ‌రిగిన ఫెడ‌ర‌ల్ ఎన్నిక‌ల టైంలోనూ హైడెన్‌తో క‌లిసి ఆంథోని ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నిక‌ల్లో ప్రధానిగా ఎన్నికైన అల్బనీస్ ఆ త‌ర్వాత‌.. అధికార పర్యటనలకూ జోడీని తీసుకెళ్లారు.. హైడెన్ ప్రస్తుతం న్యూ సౌత్ వేల్స్ ప‌బ్లిక్ స‌ర్వీస్ అసోసియేష‌న్‌లో అధికారిణిగా పని చేస్తున్నారు. కాగా, అల్బనీస్ ఆంథోనికి ఇది సెకండ్ మ్యారేజ్.. న్యూ సౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియ‌ర్ కార్మెల్ టెబ‌ట్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు 23 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. 19 సంవత్సరాల వివాహ బంధానికి గుడ్ బై చెబుతూ 2019లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.