
Alexei Navalny: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించడంపై వెస్ట్రన్ దేశాలు పుతిన్‌పై భగ్గుమంటున్నాయి. శుక్రవారం నవల్నీ జైలులో మరణించారు. అతని మరణానికి రష్యా అధ్యక్షుడే కారణం అని.. పుతిన్ “కిల్లర్” అంటూ యూరప్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాల్లో ప్రజలు నినదించారు. యూరప్ లోని పలు నగరాల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ముఖ్యంగా రష్యన్ ఎంబసీల ముందు నిరసన తెలిపారు. నవల్నీది మరణం కాదని హత్య అని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. రోమ్, ఆమ్స్టర్డామ్, బార్సిలోనా, సోఫియా, జెనీవా,ది హేగ్‌లలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం..గర్భిణిపై గ్యాంగ్ రేప్ చేసి, నిప్పంటించారు..
నవల్నీ మరణంపై బ్రిటిష్ ప్రభుత్వం రష్యా రాయబార కార్యాలయానికి సమన్లు పంపింది. అతని మరణానికి రష్యా అధికారులే పూర్తి బాధ్యత వహించాలని సమన్లలో పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమాధానం చెప్పాలని బ్రిటిష్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ శుక్రవారం అంతకుముందు అన్నారు. యూకే పీఎం రిషి సునాక్ నవల్నీ మరణానికి నివాళులు అర్పించారు.
రష్యాలో అధ్యక్షుడు పుతిన్‌కి గట్టి ప్రత్యర్థిగా అతని విధానాలను వ్యతిరేకించిన వ్యక్తిగా అలెక్సీ నవల్నీకి పేరుంది. అయితే, గత దశాబ్ధ కాలంగా ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో అతనిపై జైలులో విషప్రయోగం జరిగినట్లు ఆరోపించారు. తనను పుతిన్ అంతం చేయాలని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. తాజాగా శుక్రవారం అనూహ్య పరిస్థితుల్లో మరణించారు.