Leading News Portal in Telugu

Alexei Navalny: అలెక్సీ నవల్నీ తల, ఛాతీపై గాయాలు.. పుతిన్ పై విమర్శలు..!



Alexy

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క ప్రముఖ విమర్శకుడు అలెక్సీ నవల్నీ శుక్రవారం నాడు జైలులో మరణించాడు.. అయితే, అతడి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, తాజాగా, అలెక్సీ తల, ఛాతీపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని రష్యన్ వార్తాపత్రిక నోవాయా గెజిటా యూరోప్ తెలియజేసింది.. 47 ఏళ్ల అలెక్సీ నవల్నీ ఆర్కిటిక్‌లోని పోలార్ వోల్ఫ్ పెనాల్ కాలనీలో అతను మూడు దశాబ్దాలుగా శిక్ష అనుభవిస్తున్నాడు.. కాగా, శుక్రవారం నాడు ఉదయం వాకింగ్ చేస్తుండగా స్పృహ కోల్పోయి మరణించాడు.. అయితే, అస్పత్రికి తరలించగా, అప్పటికే మణించినట్లు డాక్టర్లు చెప్పడంతో అతడి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: Garlic: వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో.. రైతులు పంటని కాపాడుకోవడానికి రైతుల తిప్పలు..

అయితే, సాధారణంగా జైలులో మరణించిన వ్యక్తుల మృతదేహాలను నేరుగా గ్లాజ్‌కోవా స్ట్రీట్‌లోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌కు తీసుకువెళతారు.. కానీ, అలెక్సీ నవల్నీ మరణం తరువాత, అతని మృతదేహాన్ని మొదట సమీపంలోని పట్టణమైన లాబిట్‌నాంగికి తీసుకెళ్లారు.. ఆ తరువాత ప్రాంతీయ రాజధాని సలేఖర్డ్‌లోని జిల్లా క్లినికల్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల దానిని క్లినికల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అని పారామెడిక్‌ని ఉటంకిస్తూ వార్తాపత్రిక పేర్కొంది.

Read Also: Adlur Laxman Kumar: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు తప్పిన ప్రమాదం

ఇక, అలెక్సీ నవల్నీ తీవ్రంగా గాయపర్చడంతో మూర్ఛ వచ్చి మరణించినట్లు రష్యన్ వార్తపత్రిక ఆరోపించింది. అయితే, నవాల్నీని కొట్టి చంపారనే వార్తలను రష్యా ప్రభుత్వం ఖండించింది. అతను సహజ కారణాల వల్ల మరణించాడని పేర్కొంది. అలెక్సీ మరణం తర్వాత మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లారు.. అక్కడ ఇద్దరు పోలీసులను భద్రత కోసం ఉంచారు. దీంతో అతడి మృతిపై ఏదో మిస్టీరియస్ జరుగుతోంది! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.