Leading News Portal in Telugu

Pakistan: పెళ్లి వేడుకలో గ్యాంగ్‌స్టర్ హత్య



Tipu Murder In Pak

పాకిస్థాన్‌ (Pakistan)లో ఓ గ్యాంగ్‌స్టర్‌ హత్యకు గురయ్యాడు. పెళ్లి వేడుకకు వెళ్లిన అతడిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు. సోమవారం లాహోర్‌లో ఈ ఘటన చోటుచేసుకొంది.

గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌ యజమాని అయిన అమీర్‌ బాలాజ్‌ టిప్పు (Gangster Ameer Balaj Tipu) అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌. లాహోర్‌లో (Lahore) జరిగిన వివాహ వేడుకకు (Wedding) హాజరయ్యాడు. మ్యారేజ్ జరుగుతుండగా అమీర్‌పై కొందరు వ్యక్తులు కాల్పులకు జరిపారు. ఈ ఘటనలో అతడితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన అమీర్‌ సహాయకులు ఎదురుకాల్పులు జరపగా.. ఆ కాల్పుల్లో ఒక షూటర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

కాల్పుల్లో గాయపడిన వారిని స్థానికులు జిన్నా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమీర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే అమీర్‌ తండ్రి, తాత కూడా ఇదేరీతిన మరణించడం విశేషం. వారిద్దరూ కూడా తుపాకీ బుల్లెట్లకు బలికావల్సి వచ్చింది. ఇక పెళ్లి వేడుకకు అతిథులుగా వచ్చిన వారు కూడా గాయపడడం బాధాకరం.