
రష్యా నుంచి హెలికాప్టర్‌తో సహా ఉక్రెయిన్‌కు పారిపోయిన ఓ పైలట్ (Russian pilot) స్పెయిన్‌లో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వరంగ మీడియా వెల్లడించింది. పైలట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని పేర్కొంది.
పైలట్ మృతదేహాన్ని ఫిబ్రవరి 13న దక్షిణ స్పెయిన్‌లోని విల్లాజాయిసా దగ్గర గుర్తించినట్లు మీడియా పేర్కొంది. అది రష్యా పైలట్ మ్యాక్సిమ్ కుజ్మినోవ్దిగా ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. గతేడాది ఆగస్టులో అతడు ఎంఐ-8 హెలికాప్టర్‌తో సహా పారిపోయి కీవ్ పంచన చేరాడు. ఈ విషయం రష్యాకు అవమానకరంగా మారింది. ఆ తర్వాత ఉక్రెయిన్ పాస్‌పోర్టు లభించింది. దీంతో స్పెయిన్ వెళ్లి జీవిస్తున్నాడు.
పైలట్ మ్యాక్సిమ్‌పై గత వారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు దుండగులు ఒక వాహనంలో వచ్చి దాడి చేసినట్లు సమాచారం. పోలీసులు గాలింపు చేపట్టగా.. దగ్ధమైన వాహనం దొరికింది. ఆ కాల్పుల్లో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మృతుడు నకిలీ గుర్తింపు పత్రాలతో దేశంలో నివసిస్తున్నట్లు వెల్లడించారు. అతడు రష్యా పైలట్ మ్యాక్సిమ్ అని ఉక్రెయిన్ నిఘా సంస్థ అధికారులు వెల్లడించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బద్ధ విరోధి, ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అలాగే పుతిన్‌ను విమర్శించిన మాజీ సైనికాధికారి అలెగ్జాండర్ లుత్వింకో పై కూడా పొలోనియం అనే విషపదార్థంతో దాడి చేశారు. అతడు చాలా రోజులు ఆస్పపత్రిలో చికిత్స పొంది చివరికి ప్రాణాలు విడిచాడు. తాజాగా రష్యా పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే పుతిన్‌కు వ్యతిరేకంగా పలుచోట్లు ఆందోళనలు జరుగుతున్నాయి.