
అదొక అందమైన బీచ్. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. ఓ వైపు టూరిస్టులు.. ఇంకో వైపు ఆయా వ్యాపారులు చేసుకునే మనుషులతో సందడిగా ఉంటుంది. ఇలాంటి బీచ్‌లో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
బీచ్ అనగానే ఇసుక మేటలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఇసుకతో ఆటలాడుకుంటారు. దీనికి చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆడుకుంటారు. కొందరు ఇసుకతో ఇల్లు కడుతుంటారు.. ఇంకొందరు పెద్ద దిబ్బగా వేసి ఆడుకుంటారు. ఇలా రకరకాలుగా ఇసుకతో ఆటలాడుకోవడం సముద్ర తీరాల్లో సహజమే. కానీ ఆ ఇసుకే ఒకరి ప్రాణాలు తీయగా.. మరొకరు కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నారు.
ప్రముఖ ఫ్లోరిడా బీచ్‌లోని (Florida Beach) లాడర్‌డేల్-బై-ది-సీ (Lauderdale-by-the-Sea) ఒక ప్రసిద్ధ ప్రదేశం. ప్రధాన ఆకర్షణలలో ఇదొకటి. ఇక్కడ పిల్లలు ఇసుకతో ఆటలాడుకుంటున్నారు. ఒక పెద్ద గొయ్యి తవ్వుతుండగా బాలిక అందులో పడిపోయింది. ఇసుక ఆమె మీద పడిపోవడంతో ఊపిరి ఆడక ప్రాణాలు విడిచింది. బాలికను రక్షించేందుకు బాలుడు ప్రయత్నించగా అతడిపై కూడా ఇసుక పడిపోయింది. కానీ కొన ఊపిరితో ఉండగా స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చనిపోయిన బాలిక పర్యాటకురాలా? స్థానికురాలా? అన్నది ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతితో పర్యాటకులు అయ్యో.. పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు.
