
Iran–Pakistan relations: ఇరాన్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి కొనసాగుతున్నాయి. జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ మిలిటెంట్ కమాండర్‌తో పాటు అతడి అనుచరులపై పాకిస్తాన్ భూ భాగంలో ఇరాన్ ఆర్మీ అధికారులు దాడి చేసి హత మార్చారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. దక్షిణ ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్ కేంద్రంగా 2012లో జైష్ అల్ అదిల్ కార్యకలాపాలు స్టార్ట్ అయ్యాయి.
Read Also: PM Modi: రేపు మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ
అయితే, గత కొన్నేళ్ల తర్వాత ఈ సంస్థ ఉగ్రవాదులు ఇరాన్ భద్రతా బలగాల పైనే దాడులు చేయడం ఆరంభించింది. గతేడాది డిసెంబర్‌లో సిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడిలో దాదాపు 11 మంది పోలీసులు మరణించారు. ఈ దాడి చేసింది తామేనని జైష్ అల్ అదిల్ పేర్కొనింది. గత నెలలో పరస్పరం మిసైల్ దాడులకు దిగడంతో ఇరాన్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
Read Also: Hyderabad Crime: అద్దె కారులో రెక్కీ.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్
ఈ దాడుల తర్వాత పాకిస్థాన్- ఇరాన్ దేశాల మధ్య భద్రతా సహకారం విషయంపై ఒప్పందం కూడా కుదిరింది. ఈ విషయమై రెండు దేశాల విదేశాంగ మంత్రులు కలిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. కాగా, వెనక్కి పిలిచిన ఇరు దేశాల రాయబారులను తిరిగి వారి స్థానాల్లో నియమించారు. ఈ నేపథ్యంలో జైష్ అల్ అదిల్ టెర్రరిస్టులపై పాకిస్తాన్ భూభాగంలో ఇరాన్ ఆర్మీ అధికారులు దాడి చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది.