Leading News Portal in Telugu

Russia-Ukraine War: నేటికి రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధానికి రెండేళ్లు.. ముగింపెప్పుడు ?



Russia Ukraine

Russia-Ukraine: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం రోజుల్లో ముగుస్తుందనుకున్నారు.. కానీ, ఈ వార్ స్టార్ట్ అయ్యి.. నేటికి రెండేళ్లు దాటినా కొనసాగుతూనే ఉంది. అయితే, కొన్నాళ్లుగా ఉక్రెయిన్‌ క్రమంగా చతికిలపడుతుండగా రష్యా దూకుడు పెంచుతుంది. అయినా రష్యాకు లొంగిపోయేందుకు ఉక్రెయిన్‌ ససేమిరా అంటోంది. పైగా ఆక్రమిత భూభాగాల నుంచి వైదొలగి, తమకు కలిగించిన అపార నష్టానికి రష్యా భారీగా పరిహారం చెల్లించాలని ఉక్రెయిన్ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనబడటం లేదు.

Read Also: Medaram Jathara: ముగింపు దశకు మేడారం మహా జాతర.. కిక్కిరిసిన గద్దెల పరిసరాలు

అయితే, తొలినాళ్లలో రష్యా సేనలు దూకుడుగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపం దాకా వెళ్లాయి. యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని ఆక్రమించడంతో యావత్‌ యూరప్‌ ఖండం భద్రతాపరమైన ఆందోళనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ ఆ జోరుకు నెల రోజుల్లోనే బ్రేకులను ఉక్రెయిన్ వేసింది. ఉక్రెయిన్‌ దళాలు ముప్పేట దాడులతో రష్యా సైన్యాన్ని నిలువరించాయి. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల సపోర్టుతో పైచేయి సాధిస్తూ వచ్చింది.

Read Also: PM Modi: రేపు మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

కానీ సెప్టెంబర్‌ నాటికి జపోరిజియాతో పాటు కీలకమైన డొనెట్స్‌క్, లుహాన్స్‌క్, ఖెర్సన్‌ ప్రాంతాలను రష్యా స్వాదీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మాస్కోకు చెందిన భారీ యుద్ధ నౌకలతో పాటు క్రిమియాతో రష్యాను కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేయడం లాంటి చర్యలతో ఉక్రెయిన్‌ అప్పుడప్పుడూ పైచేయి సాధిస్తున్నట్లు కనిపించింది. 2023 మేలో ఏకంగా మాస్కోలో పుతిన్‌ అధికార నివాసమైన క్రెమ్లిన్‌పై రెండు ఉక్రెయిన్‌ డ్రోన్లతో దాడి చేసింది.

Read Also: Hyderabad Crime: అద్దె కారులో రెక్కీ.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్

ఇక, ఆ తర్వాత నుంచీ ఉక్రెయిన్‌ దూకుడు స్లో అయింది. ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి దెబ్బకు తొలుత అపార నష్టం చవిచూసిన రష్యా సైన్యం తానూ అదే బాటలో నడిచింది. కొంతకాలంగా ఇరు దేశాల సైన్యం డ్రోన్లపైనే ఆధారపడుతున్నాయి. అయితే, 2023లోనే ఉక్రెయిన్‌ ఏకంగా 3 లక్షల డ్రోన్లను తయారు చేసుకున్నట్లు సమాచారం. వాటిని 2024లో 10 లక్షలకు పెంచాలని చూస్తోంది. వీటికి చిన్న తరహా మిసైళ్లను కూడా జత చేస్తుంది.