Leading News Portal in Telugu

German: గంజాయి వినియోగంపై జర్మన్ పార్లమెంట్ కీలక నిర్ణయం.. ఆ బిల్లుకు ఆమోదం!



Germany

German Parliament: గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్‌ దేశాల సరసన జర్మనీ చేరిపోయింది. తాజాగా, ప్రతిపక్ష పార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ ఆమోదించింది. వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి పరిమితంగా కలిగి ఉండటాన్ని.. నియంత్రిత సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంట్‌ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసే వారి దగ్గర నుంచి రోజుకు 25 గ్రాముల వ్యక్తిగత వినియోగం ప్రాతిపదికన గంజాయి కొనుగోలు చేసే అవకాశం ఈ బిల్లు కల్పించింది.

Read Also: Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ రిలీజ్..నాని బర్త్ డే ట్రీట్ అదిరిపోయిందిగా..

ఇంతే కాకుండా ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలను కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతూ జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్‌ లాటర్బాక్‌ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జర్మన్ దేశంలో ఉన్న పరిస్థితిలో ఈ చట్టానికి ఆమోదం తెలపడం మనందరికీ ఎంతైనా అవసరం ఉందన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో యువత బ్లాక్‌ మార్కెట్‌లో కొని గంజాయిని సేవిస్తోంది అనే విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టానికి ఆమోదం తెలపడంతో జర్మన్ లోని యువత హర్షం వ్యక్తం చేస్తుంది.