
Mother: అమెరికాలో దారుణం జరిగింది. ఓ దుర్మార్గపు తల్లి తన సంతోషం చూసుకుంది. తనకు ఓ బిడ్డ ఉందని మరిచి విహారయాత్రలకు వెళ్లింది. 16 ఏళ్ల పసిబిడ్డను ఒంటరిగా ఇంట్లో వదిలి డెట్రాయిట్, ప్యూర్టో రికోకు వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లింది. 10 రోజుల పాటు ఇంట్లో చూసుకునే వారు లేకుండా బిడ్డ ఉండటంతో మరణించింది. నిందితురాలైన మహిళను ఓహియో రాష్ట్రానికి చెందిన క్రిస్టెల్ కాండెలారియోగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె హత్యానేర విచారణ ఎదుర్కొంటోంది. మహిళ 16 నెలల కుమార్తెను ఒంటరిగా ఇంట్లోనే విడిచిపెట్టినట్లు ఒప్పుకుంది. 32 ఏళ్ల క్యాండెలారియా ఇప్పుడు కౌంటీ కోర్టులో హత్య, పిల్లలకు అపాయం చేసిందనే ఆరోపణల కింద జీవిత ఖైదును ఎదుర్కొంటోంది.
Read Also: Delhi: ఢిల్లీలో సంచలనం రేపిన 8వ తరగతి విద్యార్థి హత్య కేసు..
జూన్ 16న చిన్నారి జైలిన్‌ని కుటుంబీకులు అచేతన స్థితిలో గుర్తించారు. వెంటనే క్లీవ్ ల్యాండ్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఎంతగా ప్రయత్నించినప్పటికీ, చిన్నారి మరణించినట్లు నిర్ధారించారు. డెట్రాయిట్, ప్యూర్టో రికో వెళ్లేందుకు క్యాండెలారియా తన కుమార్తెను ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది.
చిన్నారి ఉన్న ప్రాంతం అంతా మూత్రం, మలంతో బాధాకర పరిస్థితుల్లో కనుగొనబడింది. బిడ్డ శరీరంపై గాయాలకు సంబంధించిన ఆనవాళ్లు లేకపోగా.. చిన్నారిని 10 రోజులుగా ఎవరూ గమనించలేదని పోలీసులు వెల్లడించారు. అత్యంత డీహైడ్రేషన్ స్థితిలో చిన్నారి మరణించినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. పోస్టుమార్టు రిపోర్టులో చిన్నారి జైలిన్ ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా మరణించినట్లు తెలిసింది. ఈ కేసు మార్చి 18న కుయాహోగా కౌంటీ జస్టిస్ సెంటర్‌లో విచారణకు రానుంది.