పాకిస్థాన్‌లోని లాహోర్‌లో యువతి డ్రెస్ పై అరబిక్ భాషలో ఖురాన్‌ను కించపరిచే రాతలున్నాయన్న ఆరోపణలతో కొందరు చుట్టుముట్టారు. వెంటనే ఓ మహిళా పోలీసు ఆ యువతిని ఆ మూక నుంచి రక్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ గుంపు చుట్టుముట్టడంతో యువతి తన ముఖం కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకుంది.
Read Also: Arunachal Pradesh: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..
ఈ సమయంలో ఓ మహిళా పోలీసు అధికారి వచ్చి ధైర్యంగా ఆమెను రక్షించి అక్కడి నుంచి తీసుకెళ్లింది. ఇక, ఈ వీడియెను ఆ మహిళా పోలీసును ఉద్దేశించి పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనపై ఆ మహిళా పోలీసు మాట్లాడుతూ.. అరబిక్‌లో ఏవో పదాలు రాసి ఉన్న దుస్తులు వేసుకున్న మహిళ ఆమె భర్తతో కలిసి షాపింగ్‌కు రావడంతో ఆమె ధరించిన కుర్తాపై అరబిక్‌లో ఏదో రాసి ఉంది. దీంతో వెంటనే ఆ మహిళ దగ్గరకు కొందరు వచ్చి కుర్తాను తీసేయాలని వారు డిమాండ్ చేశారు.
Read Also: Ration Card E-KYC: ముగుస్తున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో మూడు రోజులే ఛాన్స్
ఇక, దీనికి స్పందించిన ఆ మహిళ డిజైన్ బాగున్నందునే వాటిని కొనుగోలు చేసినట్లు సమాధానం ఇచ్చింది. నాకు ఖురాన్‌ను కించపరిచే ఉద్దేశం ఏమీ లేదని స్పష్టం చేసింది అని ఆ మహిళా పోలీసు వెల్లడించింది. అయితే, మరి కొందరు మాత్రం మహిళ ధరించిన దుస్తులపై ఖురాన్‌ను కించపరిచే ఎలాంటి రాతలు లేవని సోషల్ మీడియలో పోస్టులు పేర్కొన్నాయి. కాగా, ఇటీవలి కాలంలో దేశంలో మతం పేరుతో మాబ్ లించింగ్ పెరిగిపోయిందంటున్నారు. రాజకీయాల కోసమే కొందరు వీటిని ప్రోత్సహిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
This woman police officer is a star. Doing exactly what the state should do when citizens are harassed and attacked for alleged blasphemy.
Pakistan’s blasphemy laws, their daily abuse, violent mobs & extremist groups with state patronage have led the country to this madness. pic.twitter.com/o96vhTsIhJ— Raza Ahmad Rumi (@Razarumi) February 25, 2024