Palestinian Prime Minister: గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తన పదవికి ఇవాళ రాజీనామా చేసారు. దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పించినట్లు పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో తన రాజీనామాను సమర్పించినట్లు వెల్లడించారు. గాజాతో పాటు వెస్ట్‌బ్యాంక్, జెరూసలేం ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హమాస్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనాపై యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే పాలస్తీనా రాజకీయ ఏకాభిప్రాయం కుదిరేందుకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రధాని సయ్యే చెప్పారు.
Read Also: PM Modi: రూ. 41వేల కోట్ల విలువైన రైలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ