
Israel-hamas war: ఇజ్రాయెల్- హమాస్ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఇక, ఇరు పక్షాల మధ్య ఒప్పందంలో భాగంగా.. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టాల్సి ఉంది.. మరోవైపు ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేయాల్సిందింగా సందికి చర్చలు జరుగుతున్నాయి. గాజాలో మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారి కోసం సహాయ సామగ్రితో వందలాది ట్రక్కులను కూడా లోపలికి అనుమతిస్తున్నారు.
Read Also: Neil Wagner Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్!
దాదాపు ఆరు వారాల పాటు కాల్పుల విరమణ కొనసాగొచ్చని సమాచారం. ఇదే విషయంపై హమాస్ మినహా వివిధ పక్షాలకు చెందిన ప్రతినిధులు గతవారం ప్యారిస్‌లో సమావేశం అయినట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ తెలిపారు. సంధి ఖరారుకు అడ్డంకిగా ఉన్న అంశాలు చర్చించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఈజిప్టు, ఖతర్, అమెరికా నిపుణులు ఇజ్రాయెల్- హమాస్ ప్రతినిధులతో సమావేశం అయినట్లు కైరో అధికారిక మీడియా తెలిపింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌కు ముందే ఒప్పందానికి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Himachal Pradesh : వివాహ వయస్సు మూడేళ్లు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
అయితే, హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై జరుగుతున్న చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. సైనిక, నిఘా సంస్థల అధికారులు ఒప్పందంపై చర్చల కోసం ఖతర్ వెళ్లినట్లు ఇజ్రాయెల్ మీడియా చెప్పుకొచ్చింది. నవంబరులో వారం రోజుల పాటు కుదిరిన ఒప్పందాన్ని పర్యవేక్షించిన ఖతర్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్-థానీ తాజా చర్చల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. గాజాలోని రఫాలో భూతల పోరుకు సంబంధించిన ప్రణాళికను సైన్యం అందజేసిందని బెంజమిన్ సోమవారం నాడు వెల్లడించారు. ప్రస్తుతం రఫాలో 14 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఇబ్బంది కలగకుండా పోరు ఎలా సాగించాలనేది కేబినెట్లో చర్చించామని నెతన్యాహు పేర్కొన్నారు.