Leading News Portal in Telugu

Abu Dhabi: మోడీ ప్రారంభించిన దేవాలయంపై అప్‌డేట్ ఇదే!



Mdi

అబుదాబి (Abu Dhabi)లో ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించిన తొలి హిందూ దేవాలయం మార్చి 1 నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానున్నట్లు బీఏపీఎస్(BAPS) సంస్థ తెలిపింది.

ఈనెల 13, 14 తేదీల్లో ప్రధాని మోడీ యూఏఈలో (UAE) పర్యటించారు. పర్యటనలో భాగంగా అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాలన్ని (Hindu stone temple) ఈనెల 14న మోడీ ప్రారంభించారు. 5 వేల మంది ప్రత్యేక ఆహ్వానితుల మధ్య దేవాలయం ప్రారంభమైంది. అయితే ఫిబ్రవరి 15 నుంచి ఈనెల 29 వరకు ముందుగా రిజిస్టర్ చేసుకున్న విదేశీ భక్తులు, వీఐపీలకు మాత్రమే ప్రవేశం కల్పించారు.

అయితే మార్చి 1 నుంచి మాత్రం ప్రజల సందర్శనార్థం తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఆలయం తెరవడి ఉంటుందని పేర్కొన్నారు. ఇక సోమవారం మాత్రం మూసివేయబడి ఉంటుందని చెప్పారు.

దాదాపు 27 ఎకరాల్లో రూ. 700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. భారత్ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేకమైన రాళ్లతో.. నైపుణ్యం కలిగిన కళాకారులచే ఆలయాన్ని నిర్మించారు.