Leading News Portal in Telugu

Afghanistan : ఆఫ్ఘనిస్థాన్ లో హిమపాతం.. 15మంది మృతి, 30మందికి గాయాలు



New Project (71)

Afghanistan : గత మూడు రోజులుగా ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. గత మూడు రోజులుగా పలు చోట్ల భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖగోళ విపత్తు కారణంగా ఇప్పటివరకు దాదాపు 15 మంది మరణించగా, దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Read Also:Etela Rajender: కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కి ఓటు వేశారు.. ఈటల కామెంట్

ఈ ప్రకృతి ధాటికి మూగ జంతువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. బాల్ఖ్, ఫర్యాబ్ ప్రావిన్సుల నుండి అందుకున్న సమాచారం ప్రకారం.. మంచు కారణంగా సుమారు పది వేల జంతువులు చనిపోయాయి. గత కొన్ని రోజులుగా నిరంతరంగా మంచు కురుస్తోందని, దీని వల్ల చాలా నష్టం జరుగుతోందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. రోడ్లపై దట్టమైన మంచు పేరుకుపోయింది. దీంతో అన్ని రవాణా మార్గాలు మూసుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అనేక జంతువులు కూడా ఆకలితో చనిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని ఇక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు. చిన్న పిల్లలు ఆకలితో విలపిస్తున్నారు. మంచు కురుస్తుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు.

Read Also:Jr Ntr : ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిపోయాడు.. న్యూ లుక్ ఫోటోలు వైరల్..

పశువుల యజమానులు ఎదుర్కొంటున్న నష్టాల పరిష్కారానికి వివిధ మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలు మూసుకుపోయిన రోడ్లను తెరవడం, బాధిత వర్గాలకు ఆహారం, పశుగ్రాసం పంపిణీ చేయడంతోపాటు హిమపాతంలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు చురుకుగా పనిచేస్తున్నాయి. బాల్ఖ్, జాజ్జాన్, బద్గీస్, ఫర్యాబ్, హెరాత్ ప్రావిన్సులలోని పశువుల యజమానులకు సహాయం చేయడానికి అధికారులు 50 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందించారు.