
26/11 Mumbai Attack: 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా(LeT) ఉగ్రసంస్థ టెర్రిరిస్ట్ ఆజం చీమా(70) పాకిస్తాన్లో మరణించినట్లు తెలుస్తోంది. 2008లో ముంబైపై ఉగ్రదాడిలో ఇతను కీలకంగా వ్యవహిరించాడు. 70 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో గుండె పోటుతో మరనించాడు. లష్కరే తోయిబా సీనియర్ కమాండర్‌గా ఉన్న చీమా 26/11 ముంబై ఎటాక్స్, జూలై 2006లో ముంబైలో జరిగిన రైలు బాంబు పేలుళ్లలో కీలక నిందితుడు.
అమెరికా ట్రెజరీ విభాగం చీమాను LeT కార్యకలాపాల్లో కీలక కమాండర్‌గా అభివర్ణించింది. అల్‌ఖైదా ఒసామా బిన్ లాడెన్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. చీమా పాకిస్తాన్ కేంద్రంగా భారత్‌కి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడు. పంజాబీ అనర్గళంగా మాట్లాడే చీమా 2000ల ప్రారంభంలో పాకిస్తాన్ బహవల్పూర్లో తన భార్య, ఇద్దరు పిల్లలతో నివసించాడు. ల్యాండ్ క్రూజర్ కార్లలో, బాడీగార్డుల సంరక్షణలో తిరిగే వాడు.
Read Also: Gangster: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్, ఆర్ఎస్ఎస్ నేత హత్యలో నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్..
బహవల్పూర్ క్యాంపులో ఆయుధ శిక్షణ పొందుతున్న జిహాదీలకు బ్రెయిన్‌వాష్ చేయడానికి ఐఎస్ఐ మాజీ చీఫ్ హమీద్గుల్, బ్రిగేడియర్ రియాజ్, కల్నల్ రఫీక్‌లను వంటి వారిని తీసుకొచ్చేవాడు. లాహోర్‌లో ఉగ్ర శిక్షణా శిబిరాలకు కూడా తరుచు చీమా వెళ్తుండేవాడు. భారతదేశంలో కీలకమైన ప్రాంతాలను గుర్తించేందుకు మ్యాప్‌ల వినియోగంపై టెర్రరిస్టులకు చీమా శిక్షణ ఇచ్చాడు. శాటిలైట్ ఫోన్ల ద్వారా ఇండియాలో ఉంటున్న లష్కరే తీవ్రవాదులకు సూచనలిచ్చే వాడని ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఉన్నాయి. 2008లో చీమా పాకిస్తాన్ బహవల్పూర్ LeT కమాండర్‌గా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత లష్కర్ సీనియర్ ఉగ్రవాది జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి ఆపరేషన్స్ అడ్వైజర్తా నియమించబడ్డాడు. చీమా 26/11 ముంబై దాడుల ప్రణాళిక మరియు అమలులో పాల్గొన్నాడు, టెర్రరిస్టుల శిక్షణ, రిక్రూట్మెంట్లో ఇతన ప్రమేయం ఉంది.