Leading News Portal in Telugu

China: డిఫెన్స్ బడ్జెట్‌ని భారీగా పెంచిన చైనా..



China

China: డ్రాగన్ కంట్రీ చైనా రక్షణ బడ్జెట్‌ని పెంచింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, 2024 రక్షణ వ్యయాన్ని పెంచుతామని చైనా మంగళవారం ప్రకటించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) వార్షిక సమావేశ ప్రారంభంలో గత ఏడాది కన్నా 7.2 శాతం పెరుగుదలను ప్రకటించింది. 2024లో రక్షణ బడ్జెట్‌ని 1.665 ట్రిలియన్ యువాన్లు ($231.4 బిలియన్లు) ఖర్చు చేయనుంది.

పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సంఖ్యలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్మీగా ఉన్నప్పటికీ.. రక్షణ బడ్జెట్ విషయంలో అమెరికా తర్వాతి స్థానంలో ఉంది. అయినప్పటీకీ, చైనా సైనిక వ్యయం ఇటీవల కాలంలో అమెరికా కన్నా మూడు రెట్లు తక్కువగా ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా తన భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను రక్షించుకోవడానికి రక్షణ బడ్జెట్ పెంచుతుందని ఎన్పీసీ ప్రతినిధి లౌ కిన్జియాన్ సోమవారం తెలిపారు.

Read Also: Tamil Nadu: బ్రైడ్ ఆఫ్ తమిళనాడు.. మళ్లీ అభాసుపాలైన స్టాలిన్ సర్కార్

పొరుగు దేశాలతో ముఖ్యంగా భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలతో చైనా గొడవలు పెట్టుకుంటోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో జపాన్‌తో సహా పలు దేశాల సార్వభౌమాధికారాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఇక భారత్‌తో సరిహద్దు చికాకులు పెట్టడంతో పాటు హిందూ మహాసముద్రంలో మాల్దీవుల వంటి చిన్న దేశాలను అక్కున చేర్చుకుని మన దేశాన్ని చికాకు పెట్టే ప్రయత్నం చేస్తోంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) ప్రకారం, చైనా సైనిక వ్యయం దాని GDPలో 1.6 శాతంగా ఉంది, ఇది యునైటెడ్ స్టేట్స్ లేదా రష్యా కంటే చాలా తక్కువ. ఇక తైవాన్‌ని ఎప్పుడు చేజిక్కించుకుందామనే ఆలోచనలో చైనా ఉంది. ఎన్పీసీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే.. యథావిధిగా తైవాన్ స్వాతంత్ర్యాన్ని, వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది.

చైనా రక్షణ పరిణామాలు అమెరికా, నాటో దేశాలకు ప్రమాదకరంగా మారాయి. చైనాను నాటో దేశాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాలుగా నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్ బర్గ్ జనవరిలో వ్యాఖ్యానించారు. చైనా గతేడాది అణువార్ హెడ్ల సంక్యను గణనీయంగా పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. సిప్రి ప్రకారం.. బీజింగ్ 2023లో 410 న్యూక్లియర్ వార్‌హెడ్లు ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 60కి పెరిగాయి. అయినప్పటీకీ అమెరికా వద్ద 3708, రష్యా వద్ద 4489 కంటే తక్కువనే చెప్పాలి. రక్షణ బడ్జెట్ విషయానికి వస్తే ఇప్పటికే అమెరికానే టాప్‌లో ఉంది. తర్వాత స్థానాల్లో చైనా, రష్యా, భారత్ ఉన్నాయి.