Leading News Portal in Telugu

Israel: భారతీయుడి మృతి వెనుక అంతులేని విషాదం



Inde

ఇజ్రాయెల్‌పై (Israel) జరిగిన క్షిపణి దాడిలో భారతీయుడి మృతి.. ఆ కుటంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మృతుడు కేరళకు చెందిన మ్యాక్స్‌వెల్‌గా గుర్తించారు. మ్యాక్స్‌వెల్‌‌కు ఇప్పటికే ఐదేళ్ల కుమార్తె (Daughter) ఉండగా.. భార్య ఏడు నెలల గర్భవతిగా (Pregnant wife) ఉంది. రెండు నెలల క్రితమే మ్యాక్స్‌వెల్ పనుల నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లాడు. క్షిపణి దాడిలో ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టబోయే బిడ్డను చూడకుండానే ఇలా అర్థాంతరంగా ప్రాణాలు పోవడంతో బంధువులు కున్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మ్యాక్స్‌వెల్‌ స్వస్థలం కొల్హాంలోని కైకులంగారా. వ్యవసాయం క్షేత్రంలో పని చేసేందుకు రెండు నెలల క్రితమే ఇజ్రాయెల్‌ వెళ్లారు. ఆయన భార్య రెండోసారి ఏడు నెలల గర్భిణి. ఆ జంటకు ఇప్పటికే ఐదేళ్ల కుమార్తె కూడా ఉంది. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం జరిగిందని.. సోమవారం సాయంత్రం తమ కోడలు ఫోన్‌ చేసి చెప్పిందని… అర్ధరాత్రికి కుమారుడి మరణవార్త తెలిసిందని మ్యాక్స్‌వెల్ తండ్రి విలపించారు. మ్యాక్స్‌వెల్‌ మృతదేహం నాలుగు రోజుల్లో భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ దాడి హెజ్‌బొల్లా పనేనని అనుమానిస్తున్నారు. హమాస్‌కు మద్దతుగా ఈ గ్రూప్‌ అక్టోబర్‌ 8 నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీనికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ప్రకటించింది.

ఇదిలా ఉంటే కేరళ వాసి మృతితో భారత్ అప్రమత్తమైంది. భారతీయులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే, పర్యటించే భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.