Leading News Portal in Telugu

Russia-Ukraine: యుద్ధంలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం



War

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో (Russia-Ukraine) అమాయక భారతీయు యువకులు బలైపోతున్నారు. పలువురి ఏజెంట్ల ద్వారా మోసపోయి.. యుద్ధంలో చేరి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవలే చాలా మంది భారతీయ యువకులు రష్యా యుద్ధంలో చేరినట్లు వార్తలు రాగానే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చేరొద్దని సూచించింది.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన మహ్మద్ అస్ఫాన్‌ (30) (Mohammed asfan) ఉద్యోగ రీత్యా రష్యా వెళ్లాడు. ఓ బట్టల షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఓ ఏజెంట్ ద్వారా మోసపోయి యుద్ధంలో చేరి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గత డిసెంబర్ నుంచి అతని ఆచూకీ లభించలేదు. దీంతో యుద్ధంలో అస్ఫాన్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది.

తాజాగా అస్ఫాన్ యుద్ధంలో చనిపోయినట్లు రష్యన్ ఎంబసీ నుంచి అధికారికంగా తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని కలిసి సహాయం కోరారు. మృతదేహం హైదరాబాద్ తరలించేందుకు సహాయం కోరారు. దీంతో ఓవైసీ.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడుతున్నారు.

పలువురు భారతీయ యువకులు ఏజెంట్ల మోసాలకు బలైపోతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ ధనాన్ని ఆశ జూపించి యుద్ధంలోకి నెట్టేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే యుద్ధంలో చేరొద్దని యువతకు భారత ప్రభుత్వం హెచ్చరించింది.

 

Ukew