Leading News Portal in Telugu

Paul Alexander: “ఇనుప ఊపిరితిత్తుల”తో 70 ఏళ్లు గడిపిన ‘పోలియో పాల్’ మృతి..



Paul Alexander

Paul Alexander: పాల్ అలెగ్జాండర్(78) గత 70 ఏళ్లుగా ఇనుప ఊపితిత్తులతో జీవనం సాగిస్తున్నాడు. పూర్తిగా ఐరన్ లంగ్స్ మిషన్ ద్వారా ఇన్నేళ్లు జీవించిన అతను మరణించాడు. ఆరేళ్ల వయసులో పోలియో బారిన పడిన పాల్ నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. చివరకు శ్వాస కూడా స్వయంగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడిని 600 మిలియన్ పౌండ్ల విలువైన యంత్రం సాయంతో శ్వాస తీసుకుంటూ జీవిస్తున్నాడు.

Read Also: MK Stalin: బీజేపీ, ఏఐడీఎంకే మధ్య రహస్య సంబంధం..సీఎం స్టాలిన్ సంచలన ఆరోపణలు..

అలెగ్జాండర్ పాల్ పోలియో బారిన పడిన తర్వాత 1952 నుంచి మెడ కింద నరాలు చచ్చుబడిపోయాయి. అతను స్వయంగా ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరాడు. ఆ తర్వాత అతడిని టెక్సాస్ ఆస్పత్రికి తరలించగా.. వారు పాల్‌ని మెకానికల్ ఊపిరితిత్తుల లోపల అమర్చారు. అప్పటి నుంచి దీని సాయంతో శ్వాస తీసుకుంటూ 70 ఏళ్లు గడిపారు. ఈ సమయంలోనే ఆయన న్యాయ విద్యను అభ్యసించడంతో పాటు రచయితగా మారాడు.

1946లో జన్మించిన పాల్, పిల్లల్లో ఎక్కువగా వచ్చే పోలియో వ్యాధి కారణంగా అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. పోలియో వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధి వల్ల వెన్నుపాము ఎఫెక్ట్ అవుతుంది. అలెగ్జాండర్ పాల్‌కి కూడా ఇదే సంభవించింది. అతడికి ఊపరి పీల్చుకోలేని స్థితికి చేర్చింది. అప్పటినుంచి అతను బతకడానికి మెడ నుంచి కాళ్ల వరకు ఉండే యంత్రంపైనే ఆధారపడ్డాడు. ఇనుప ఊపిరితిత్తుల ‘‘ఫ్రాగ్ బ్రీతింగ్’’(కప్పలా శ్వాసించడం) అనే సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఇది గొంతు కండరాలను ఉపయోగించి స్వరపేటికను దాటి గాలిని బలవంతంగా పంపుతుంది, ఈ సమయంలో రోగి ఆక్సిజన్ తీసుకునేందుకు సహకరిస్తుంది.