
ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల యుగం నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రస్తుత జీవనంలో మనుషుల పనులు ఎక్కువగా కంప్యూటర్లలోనే జరుగుతున్నాయి. వీటివల్ల మన కళ్ల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఎక్కువ సేపు చెవిలో హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకోవడం ద్వారా మన వినికిడి సమస్యకు దారులు తీస్తున్నాయి. ఇదే విషయం తాజాగా ఓ చైనా మహిళ విషయంలో కూడా జరిగింది. గడిచిన 2 సంవత్సరాల పాటు ప్రతిరోజు రాత్రి తన హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూనే ఉంది. దింతో ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె శాశ్వతంగా చెవిటి దానిలాగా మారింది.
also Read: Allu Arjun: బన్నీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ రోజు ఏకంగా ఇంటికే వెళ్లాను.. ‘ప్రేమలు’ బ్యూటీ..!
ప్రస్తుత రోజుల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కళ్లు తెరచిన వెంటనే కళ్ల ముందు ఉండాల్సింది సెల్ ఫోన్ అని చెప్పవచ్చు. వీటిని వాడడం ద్వారా వినియోగం కళ్లకు మాత్రమే కాకుండా, చెవులకు కూడా జరిగే నష్టం గతంలో కంటే కాస్త ఎక్కువైంది. ఇంతకి ఆ చైనా మహిళ పేరు వాంగ్. చైనా లోని షాన్ డాంగ్ లో నివసిస్తుంది. ఈవిడ అక్కడ స్థానిక సంస్థలలో సెక్రటరీగా పనిచేస్తుంది. గత కొద్దికాలంగా ఆమెకు వినికిడి సమస్య తీవ్రం కావడండతో.. తన చెవులను తనిఖీ చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లింది.
also read: Pratibha Patil: జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి
తాను ఎవరితోనైనా మాట్లాడినప్పుడల్లా వాళ్లు ఏం మాట్లాడారో అర్థం చేసుకోవడంలో అనేక ఇబ్బందులు పడినట్లు చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో ఆమె చెవులను డాక్టర్ పరిశీలించగా.. ఆమె ఎడమ చెవిలో ఉన్న శాశ్వత నరాల వినికిడి దెబ్బతినట్లు తేలింది. దీని వాళ్ల ఆ మహిళ ఏవైనా మాటలను వినడానికి ఇబ్బంది పడుతోందని వారు గుర్తించారు.చాలా సేపు చెవులు భారీ శబ్ధాన్ని విన్నాయాని డాక్టర్లు అడిగినప్పుడు ఆ మహిళకి ఒక విషయం గుర్తుకు వచ్చింది. అదేమిటంటే.. ఆమె ప్రతిరోజు రాత్రి హెడ్‌ఫోన్స్ తో పాటలు వింటూ నిద్రపోవడం. కాబట్టి మీరు కూడా ఇలా చేస్తుంటే కాస్త మారండి.