
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- అమెరికా సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన కొనసాగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కమాండర్లతో మాట్లాడుతూ ఈ విన్యాసాలను నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో ఒక కొత్త యుద్ధ ట్యాంక్ తన మొదటి ప్రదర్శనలో సక్సెస్ ఫుల్ గా మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. తన కమాండర్ల పని తీరుకు కిమ్ జొంగ్ ఉన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Shreya Goshal: వామ్మో.. ఒక్కపాటకు శ్రేయా ఘోషల్ అన్ని లక్షలు తీసుకుంటుందా?
కాగా, ఈ విన్యాసాలకు సంబంధించిన వివరాలను ఒక నివేదికలో వెల్లడైంది.‘యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పని చేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకే సారి తమ ప్రత్యర్థి లక్ష్యాలపై దాడి చేసి, చిధ్రం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్ జొంగ్ ఉన్ తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్‌నామ్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సైనిక విన్యాసాల సందర్భంగా నార్త్ కొరియా మీడియా పలు ఫోటోలను రిలిజీ చేసింది. ఒక ఫోటోలో నార్త్ కొరియా అధ్యక్షుడు యుద్ధట్యాంక్‌ను పరీక్షించడాన్ని చూడొచ్చు.. అలాగే, ఆ యుద్ధ ట్యాంక్ ను స్వయంగా నడిపినట్లు స్థానిక మీడియా పేర్కొనింది.
Read Also: Babar Azam: స్పైడర్ క్యామ్‌ని చూసి భయపడిన బాబర్ ఆజం
ఇక, మరొ ఫోటోలో కిమ్ జొంగ్ ఉన్ లెదర్ జాకెట్ ధరించగా, కమాండర్లు అతని చుట్టూ ఉన్నట్లు కనిపించారు. ఉత్తర కొరియా జెండా కలిగిన యుద్ధ ట్యాంకులు కూడా కనిబడుతున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగియనున్న తరుణంలో ఈ కసరత్తు నిర్వహించింది. నవంబర్‌లో ప్యోంగ్యాంగ్ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018 అంతర్-కొరియా సైనిక ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఈ సైనిక విన్యాసాలు చేసింది. ఈ విన్యాసాలకు ఫ్రీడమ్ షీల్డ్ ఎక్స్‌ర్‌సైజ్’ అని పేరును పెట్టింది.