
America: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత్లోఅంతర్భాభాగ మేనని అగ్రరాజ్య అమెరికా మరో సారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని తెలిపింది. అరుణాల్‌ను దక్షిణ టిబెట్‌గా అభివర్ణిస్తున్న చైనా.. అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో అరుణాచల్ భారత్‌లో అంతర్భాగంగా వాషింగ్టన్ గుర్తిస్తున్నదని అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. సైన్యం లేదా పౌరులు వాస్తవాధీన రేఖ అవతల ఆక్రమణలకు పాల్పడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.
Read Also: Glenn Maxwell-Virat Kohli: కోహ్లీని ఇమిటేట్ చేసిన మాక్స్వెల్.. వీడియో వైరల్!
ఇక, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర తమదేనంటూ డ్రాగన్ కంట్రీ చైనా మొండిగా వ్యవహరించి.. తన వక్రబుద్ధిని బయట పెట్టింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. దీనిపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. జాంగ్నాన్ తమదే, సేలా సొరంగాన్ని భారత్ చట్టవిరుద్ధంగా స్థాపించిందంటూ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షియాగాంగ్ గత శుక్రవారం పేర్కొన్నారు. అయితే, దీనిపై భారత్ దేశం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చైనా ప్రకటన అసంబద్ధమైనది.. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమే అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ భారత్‌లో అంతర్భాగంగా గుర్తిస్తున్నామని అమెరికా వెల్లడించింది.