Leading News Portal in Telugu

Maldives: మొండివైఖరి వదిలేసి భారత్ తో చర్చలు జరపండి!



Maldivus

Maldives- India Relations: మాల్డీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ దేశ రుణ పునర్నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియా నివేదికలను తాను చూశానని మాజీ ప్రెసిడెంట్ సోలిహ్ అన్నారు. దీనిపై భారత్‌తో మాట్లాడాలనుకుంటున్నాను.. అయితే ఆర్థిక సవాళ్లు భారతదేశం అప్పుల వల్ల కాదన్నారు. మాల్దీవులు చైనాకు 18 బిలియన్ల మాల్దీవుల రుఫియా (MVR) రుణాన్ని కలిగి ఉంది.. భారతదేశానికి 8 బిలియన్ల MVR రుణాన్ని కలిగి ఉంది అని తెలిపారు. దానిని తిరిగి చెల్లించే కాలం కూడా 25 సంవత్సరాలు అని చెప్పారు. అయితే, మా పొరుగు దేశం ( భారత్ ) సహాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది.. మనం మొండి వైఖరిని అవలంబించడం మానేసి వారితో మాట్లాడటం ప్రారంభించాలని ముయిజ్జూని సోలిహే కోరారు.

Read Also: Alfazolam at Hyderabad: కొత్తూర్ లో భారీగా ఆల్ఫాజోలం పట్టివేత..!

మాకు సహాయం చేసే అనేక పార్టీలు ఉన్నాయి.. కానీ ముయిజ్జూ రాజీ పడటానికి ఇష్టపడడు అని సోలిహే తెలిపారు. ముయిజ్జూ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని పేర్కొన్నారు. ఎండీపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను ఈ సర్కార్ మళ్లీ ప్రారంభించి ప్రజలను మోసం చేస్తోందని మాజీ రాష్ట్రపతి అన్నారు. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకే ప్రస్తుత మంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనూ.. ఆ తర్వాత భారత్‌పై విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.. మానవతా, వైద్య తరలింపు కోసం ఉపయోగించే మాల్దీవులలోని మూడు విమానయాన స్థావరాలలో మోహరించిన 88 మంది భారతీయ సైనిక సిబ్బందిని మే 10 నాటికి పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రెసిడెంట్ ముయిజ్జూ డిమాండ్ చేశారు అనే విషయాన్ని సోలిహే గుర్తు చేశారు.

Read Also: Road Accident : గుంటలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఇక, ఇప్పటికే 26 మంది భారతీయ సైనిక సిబ్బందితో కూడిన మొదటి బృందం మాల్దీవులను విడిచి పెట్టింది అని మాజీ అధ్యక్షుడు సోలిహే తెలిపారు. వారి స్థానంలో స్థానిక సైనికేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే, మాల్దీవులకు భారతదేశం అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉంటుందని ముయిజ్జు చెప్పారు.. ఏప్రిల్ 21వ తేదీన మాల్దీవుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు భారత్‌తో సయోధ్యకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. చైనా మద్దతుదారు ముయిజ్జూ భారతదేశం నుంచి రుణ విముక్తి పొందడం కోసం ఇలాంటి కామెంట్స్ చేశాడని మాజీ ప్రెసిడెంట్ సోలిహ్ వ్యాఖ్యనించారు.