Leading News Portal in Telugu

Saudi Arabia: “మిస్ యూనివర్స్” ఈవెంట్‌లో తొలిసారి పాల్గొననున్న సౌదీ అరేబియా..



Saudi Arabia

Saudi Arabia: సంప్రదాయ ఇస్లామిక్ దేశంగా పేరున్న ‘సౌదీ అరేబియా’ తన ఛాందసవాదాన్ని నెమ్మదిగా వదులుకుంటోంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నెమ్మదిగా ఆ దేశంలో మార్పులు వస్తున్నాయి. గతంలో మహిళా హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేని ఆ దేశంలో ఇప్పుడు ఏకంగా ఓ మహిళ దేశం తరుపున ‘‘మిస్ యూనివర్స్’’ పోటీల్లో పాల్గొనబోతోంది.

Read Also: Bengaluru Water Crisis: నీటిని దుర్వినియోగం చేసినందుకు 22 కుటుంబాలకు జరిమానా..

తొలిసారిగా సౌదీ అరేబియా తరుపున అధికారికంగా రూమీ అల్ఖహ్తనీ పోటీల్లో పాల్గొననున్నారు. 27 ఏళ్ల మోడల్ రూమీ ఈ విషయాన్ని సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ అందాల పోటీలో పాల్గొనే మొదటి వ్యక్తిని అని ఆమె చెప్పారు. ‘‘మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారి’’ అని పోస్టులో రాసుకొచ్చారు. సౌదీ రాజధాని రియాద్‌కి చెందిన అల్ఖహ్తానీ కొన్ని వారాల క్రితం మలేషియాలో జరిగి మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్‌లో పాల్గొన్న చరిత్ర ఉంది.