Leading News Portal in Telugu

US Bridge Collapse: అమెరికా వంతెన ప్రమాదంలో అలా చేయడంతో తప్పిన పెను ప్రమాదం..!



3

సింగపూర్ దేశానికి చెందిన గ్రీన్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఒక కార్గోనౌక దాలీ బాల్టిమోర్‌ నుంచి కొలంబోకు బయలుదేరింది. ఇక ఈ కార్గో షిప్ మంగళవారం నాడు ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ బ్రిడ్జికు ఉన్న పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ బ్రిడ్జి కుప్పకూలింది. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో బ్రిడ్జి పై ఉన్న చాలా తక్కువ కారులు, మరికొన్ని వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ సంఘటనలో భాగంగా అక్కడ అధికారులు ఇద్దరిని కాపాడారని.. అందులో ఒకరి పరిస్థితి కాస్త విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఈ ఘటన లో మొత్తం 6 గురు మరిణించినట్లు సమాచారం.

Also read: Telangana High Court: నేడు తెలంగాణ హైకోర్ట్ కొత్త భవనానికి శంకుస్థాపన.. సీజేఐ హాజరు

ఇక ఘటన జరిగిన తర్వాత వంతెనను ఢీకొనడంతో నౌకలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అయితే ఈ సంఘటనను ముందుగానే గుర్తించిన ఆ నౌక ఇబ్బంది అధికారులకు ముందుగా హెచ్చరించడం ద్వారా పెను ప్రమాదమే తప్పిందన్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద నేపథ్యంలో భాగంగా మేరి ల్యాండ్ గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇందుకోసం ఫెడరల్ ప్రభుత్వ సహకారం కూడా తాము తీసుకుంటామని ఆయన తెలిపారు. ఫారెన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI ) సంఘటన స్థలానికి చేరుకుందని, అయితే ఘటనకు సంబంధించి ఎలాంటి ఉగ్రవాద కోణం ఆధారాలు లభించలేదని వారు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఇందుకు సంబంధించిన సహాయక చర్యలు నిలిపిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అతి త్వరలో చర్యలు మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు.

Also read:Congress Final List: నేడు తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫైనల్‌ జాబితా!

ఈ సంఘటనలో నౌకలో ఉన్న భారతీయ సిబ్బంది అంత క్షేమంగా ఉన్నారని ఆ షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ తెలిపింది. ఆ నౌక లో మొత్తం 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు పైలెట్స్ కాగా., మిగతా వారందరూ సహాయక సిబ్బందిగా తెలుస్తోంది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.