Leading News Portal in Telugu

Viral Video: వావ్.. కుక్కతో కలిసి విదేశీ వనిత చేసిన శివ తాండవ నృత్యం అదుర్స్..!



10

ప్రతిరోజు మనం ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో రకాల విషయాలకు సంబంధించిన వీడియోలు, వార్తలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రపంచంలోని నలుమూలల ఆ విషయం చేరిపోతోంది. ఇకపోతే ప్రతిరోజు సోషల్ మీడియాలో జంతువులు, కొన్ని ఆశ్చర్యపరిచే వీడియోలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని వీడియోలు అయితే నిజంగా ఇలా కూడా జరుగుతాయా అన్న సందేహం కూడా కలగచేస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: Encounter: బీజీపూర్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి..

నిజానికి అనేక మంది భారతీయులు శివతాండవం సంబంధించిన నృత్యాలు చేసి ప్రపంచవ్యాప్తంగా అలరించారు. అయితే ప్రస్తుతం వైరల్ అయిదున్న వీడియోలో ఓ విదేశీ మహిళ శివతాండవ సంబంధించిన నృత్యం వైరల్ గా మారింది. ఆ విదేశీ మహిళ చేసిన నృత్యం వైరల్ గా మారడానికి గల కారణం.. తనతోపాటు తన పెంపుడు కుక్క కూడా డాన్స్ చేయడమే. నిజానికి ఆమెతోపాటు తన కుక్క కూడా నృత్యం చేయడం ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

Also read: Kid Climb Mount Everest: బుడిబుడి అడుగులతో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేసిన రెండున్నరేళ్ల చిన్నారి..!

ఇక ఈ వైరల్ వీడియోలో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో వేదికపై ఉండగా శివతాండవం సంబంధించిన పాట ప్లే అవుతుంది. అలా పాటకి నృత్యం మొదలుపెట్టిన విదేశీ మహిళను అనుసరించి తన పెంపుడు కుక్క కూడా ఫ్లోర్ పై డాన్స్ వేయడం చూడొచ్చు. సదరు విదేశీ మహిళ భారతీయ దుస్తులను ధరించి కుక్కతో కలిసి భారతీయ శైలిలో నృత్యం చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. ఆ పెంపుడు కుక్క కూడా తన స్టెప్పులతో అందరిని అబ్బురపరిచింది. ఇక ఈ నృత్యం సంబంధించి సదరు నృత్యం చేసిన విదేశీ మహిళ సోషల్ మీడియా వేదికగా తాను ప్రత్యేకంగా ఈ నృత్యాన్ని భారతీయ ఉపాధ్యాయుడు వద్ద నేర్చుకున్నానని క్యాప్షన్ లో పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో పై ఒక లుక్ వేయండి.

View this post on Instagram

A post shared by Anastasiia Beaumont | Founder of DogDanceMania (@anastasiia_beaumont)