Leading News Portal in Telugu

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. 14 ఏళ్ల జైలు శిక్ష రద్దు



Imran Khan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సోమవారం బిగ్ రిలీఫ్ లభించింది. ప్రభుత్వ ఖజానా (తోషాఖానా) అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో విధించిన 14 ఏళ్ల శిక్షను ఇమ్రాన్ ఖాన్ దంపతులు పాకిస్థాన్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పాకిస్థానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ ఫరూఖ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ బెయిల్​ను మంజూరు చేసింది.

Read Also: Volunteers Resign: మచిలీపట్నంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

దేశ సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జనవరి 31న ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీకి శిక్ష విధించింది. దీంతో.. పదేళ్లపాటు రాజకీయాలకు దూరం అయ్యారు. ఆ ఇద్దరికీ 787 మిలియన్ల జరిమానా కూడా విధించారు.

Read Also: Samantha: ఊహించని పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టిన సామ్.. ఇక ఆగేదేలే!

తోషాఖానా కేసులో తదుపరి విచారణ ఈద్ వేడుకల తర్వాత ఉంటుందని ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమీర్ ఫరూక్ తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో తన భార్యకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను అనవసరంగా ఈ ఊబిలోకి లాగుతున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఖరీదైన బహుమతులు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి.