Leading News Portal in Telugu

Breaking: జపాన్‌ లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.3గా తీవ్రత..!



8

గత కొద్దీ రోజుల నుండి తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం తెల్లవారుజామున తైవాన్‌ లో ఓ శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జపాన్‌ దేశంలో కూడా భూకంపం సంభవించింది. నేటి ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్‌ – మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ వివరాలను వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.3గా నమోదైనట్లు వెల్లడించింది.

Also read: Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

తాజాగా సమభావనిచ్చిన ఈ భూకంపం భూమికి 32 కి.మీ. లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఇకపోతే, ఈ సంఘటనలో ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. జపాన్‌ రాజధాని ‘టోక్యో’ నగరంలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.

Also read: OnePlus Nord CE4 Launch: నేడు మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4’.. ధర, ఫీచర్లు ఇవే!

ఇక, తైవాన్‌ లో బుధవారం ఉదయం నాడు భారీ భూకంపం సంభవించిన విషయం మనకు తెలిసిందే. ఈ భూకంపం రిక్టర్‌ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించినట్టు తైవాన్‌ భూకంప పరిశీలన సంస్థ తెలపగా, 7.4 తీవ్రతతో నమోదైనట్టు అమెరికా జియాలాజికల్‌ సర్వే మరో రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఈ భూకంపం 25 ఏళ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ భారీ భూకంపం తర్వాత మళ్లీ రిక్టరు స్కేలుపై 6.5 తీవ్రతత భూకంపం, అదే విధంగా భూమిలో ప్రకంపనలు సంభవించాయి.