Leading News Portal in Telugu

US: రష్యాకు అమెరికా మళ్లీ హెచ్చరికలు.. పట్టించుకుంటుందా?



Putin

రష్యాను మరోసారి అమెరికా హెచ్చరించింది. జపోరిజియా అణువిద్యుత్కేంద్రంపై డ్రోన్లతో ఆదివారం ఉక్రెయిన్‌ దాడి చేసింది. ఈ మేరకు ప్లాంట్‌ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా వెంటనే అక్కడి నుంచి వైదొలగాలని అమెరికా కోరింది. తక్షణమే దాని నిర్వహణ బాధ్యతను ఉక్రెయిన్‌కు అప్పగించాలని సూచించింది. ఈ కేంద్రంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం స్పందించింది. అక్కడి పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా పెద్ద ప్రమాదం సంభవించొచ్చని రష్యాను హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: RCB Fan: ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పింది.. ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు దొరికిపోయింది!

జపోరిజియా అణువిద్యుత్కేంద్రంపై డ్రోన్‌ దాడి సమాచారం తమ దగ్గర ఉందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. అక్కడి పరిస్థితులను తాము పర్యవేక్షిస్తున్నామని.. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నుంచి కూడా నివేదికలు అందాయని చెప్పారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అణు కేంద్ర భద్రతకు ముప్పు లేదని తెలిసి ఊరట చెందినట్లు చెప్పుకొచ్చారు. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్కేంద్రాన్ని ఆక్రమించి రష్యా చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ధ్వజమెత్తారు. అణు ప్రమాదం జరిగే ఎలాంటి చర్యలకూ రష్యా పాల్పడొద్దని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Memantha Siddham Bus Yatra: మళ్లీ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్‌

జపోరిజియా కేంద్రంపై డ్రోన్లతో ఉక్రెయిన్‌ దాడి చేసిందని ప్లాంట్‌ అధికారులు ఆదివారం తెలిపారు. ఆరో పవర్‌ యూనిట్‌ డోమ్‌ను డ్రోన్లు తాకాయని, తీవ్ర నష్టమేమీ జరగలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై సైనికచర్య చేపట్టిన ఆరంభంలోనే జపోరిజియా కేంద్రాన్ని రష్యా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఈ కేంద్రం పరిసరాల్లో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఐరోపాలోని అతి పెద్ద అణువిద్యుత్కేంద్రమైన జపోరిజియా రక్షణపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Lok Sabha Polls: తొలిదశలో 1625 మంది అభ్యర్థులు.. అందులో 252 మంది నేరచరితులే..