Leading News Portal in Telugu

Israel: ఇజ్రాయెల్‌ కొత్త ప్రతిజ్ఞ.. కలకలం రేపుతున్న నెతన్యాహు వ్యాఖ్యలు



Benjamin Netanyahu

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆయన మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణ గాజా నగరమైన రఫాను ఆక్రమిస్తామని నెతన్యాహు ప్రతిజ్ఞ బూనారు. దీనిపై దండెత్తేందుకు ఒక తేదీ ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు. హమాస్‌కు బలమైన స్థావరంగా ఉన్న రఫాకు బలగాలను పంపిస్తామని గతంలోనే నెతన్యాహు అనేక మార్లు చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి పునరుద్ఘాటించారు. అయితే నెతన్యాహు వ్యాఖ్యలను అమెరికా సహా అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రఫాకు బలగాలను పంపిస్తే.. అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 14 లక్షల మంది పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Guntur Kaaram: ‘గుంటూరు కారం’ను ఎంజాయ్‌ చేయలేకపోయా: జగపతి బాబు

2023, అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన గాజా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్‌ని అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు గడిచిన తరుణంలో గాజా యుద్ధంలో తాము ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామని, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా ఎలాంటి సంధి ఉండబోదని నెతన్యాహు తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Lok Sabha Polls: తొలిదశలో 1625 మంది అభ్యర్థులు.. అందులో 252 మంది నేరచరితులే..

ఇక ఏప్రిల్ 1న గాజాలో జరిపిన వైమానిక దాడిలో యూఎస్ ఆధారిత ఫుడ్ ఛారిటీ వరల్డ్ సెంట్రల్ కిచెన్‌కు చెందిన ఏడుగురు సహాయక సిబ్బంది చనిపోవడంతో ఇజ్రాయెల్ అంతర్జాతీయ ఆగ్రహాన్ని ఎదుర్కొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నెతన్యాహుకి బైడెన్ ఫోన్ చేసి.. తక్షణమే కాల్పుల విరమణకు డిమాండ్ చేశారు. అయితే ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల వెనుక ఇరాన్ ఉందని నెతన్యాహు ఆరోపణలు చేశారు. తమను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో.. వాళ్లను దెబ్బతీస్తామని పేర్కొన్నారు. ఈ సూత్రాన్ని తాము అన్ని సమయాల్లో ఆచరణలో పెట్టామని నెతన్యాహు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Janvikapoor : జాన్వీ కపూర్ వేసుకున్న ఈ డ్రెస్స్ ధర అన్ని లక్షలా?