
వరల్డ్ ఓల్డెస్ట్ అవిభక్త కవలలుగా ప్రపంచ రికార్డు సృష్టించిన లోరీ, జార్జ్ షాపెల్ కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో వీరు మరణించారు. అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఏప్రిల్ 7న వీరు చనిపోగా.. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.
శరీరాలు వేర్వేరు ఉన్న.. వీరి తలలు కలిసిపోయాయి. లోరీ, జార్జ్ వేర్వేరు లింగాలుగా గుర్తించబడిన మొదటి స్వలింగ కవలలు. లోరీ స్త్రీ, జార్జ్ ట్రాన్స్‌జెండర్. 1961 సెప్టెంబరు 18న పెన్సిల్వేనియాలో జన్మించిన లోరీ మరియు జార్జ్ సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించారు. శారీరకంగానే కాకుండా వారి అభిరుచులు, వ్యక్తిత్వం మరియు వృత్తిలో కూడా ప్రతికూలతలను ఎదుర్కొన్నారు.
Yuzvendra Chahal: చాహల్ ముందు సరికొత్త రికార్డు.. నేటి మ్యాచ్లో సాధ్యమయ్యేనా..?
లోరీ, జార్జ్ క్రానియోపాగస్ కవలలు కాగా.. వారి పుర్రెలు 30 శాతం ఒకదానికొకటి కలిసిపోయాయి. అయితే.. లోరీ బాగా నడుస్తుంది. జార్జ్ వెన్నుపూస వ్యాధి రావడంతో.. అతను నడవలేడు. అటూ ఇటూ కదలడానికి వీల్ చైర్ లో కూర్చునేవాడు. దానిని లోరీ తోసేది. వారిద్దరూ.. దాదాపు 24 సంవత్సరాలు ఒక సంస్థలో నివసించిన తర్వాత, ఓ అపార్ట్‌మెంట్‌లోకి మారారు. ఇదిలా ఉంటే.. జార్జ్ 1990లో ఒక ప్రొఫెషనల్ సింగర్‌గా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేశారు. లోరీ టెన్-పిన్ బౌలర్‌గా గెలుపొందింది.. అంతేకాకుండా.. చాలా కాలం పాటు ఆసుపత్రిలో లాండ్రీగా కూడా పనిచేసింది.
2015లో లోరీ మరియు జార్జ్‌లు ప్రపంచంలోనే అతి పెద్ద కవలలుగా రికార్డు సాధించారు. అంతకుముందు ఈ రికార్డు.. మాషా మరియు దశా క్రివోషెల్యపోవా అనే కవలల పేరిట ఉండేది. కానీ 2015లో వారిద్దరూ 53 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆ తర్వాత ఈ రికార్డు లోరీ, జార్జ్‌ల పేరిట చేరింది. కాగా.. ఇప్పుడు వీరు కూడా చనిపోవడంతో, ఈ రికార్డును ఏ కవలలు సాధిస్తారో చూడాలి.