Heavy Rains His UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, వీధులు మొత్తం జలమయం అయ్యాయి. భారీ వరదలకు దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. ఓవైపు వరదలు, మరోవైపు తీవ్ర గాలుల కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. యూఏఈ మొత్తం పాఠశాలలను మూసివేశారు. చాలా మంది ఉద్యోగులు, కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. వీధులు, రహదారుల్లోని నీటిని ట్యాంకర్ల సహాయంతో తొలగిస్తున్నారు.
Also Read: Mamitha Baiju : ఐశ్వర్య రాయ్ పాటకు మమితా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూశారా?
మరోవైపు యూఏఈ పొరుగునున్న ఒమన్‌లో కూడా మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి వర్షాలకు ప్రధాన రహదారులు, వీధులు మొత్తం నీటితో నిండిపోయాయి. భారీ వర్షాలకు 18 మృతి చెందారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఒమన్ అత్యవసర నిర్వహణ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి.
Heavy Rains lash UAE and Surrounding Nations #dubai #Flood #rain #Iran #TDR__now #TDR_now pic.twitter.com/11dAIGnZQf
— 𝘚𝘢𝘯𝘢 𝘚𝘩𝘢𝘩 ثناء شاہ (@meSana220) April 16, 2024
BREAKING ALERT
UAE weather:
Stay-home advisory issued as heavy rains lash all 7 Emirates
The public told to leave the safety of their homes only in ‘cases of extreme necessity’UAE residents have been asked to stay at home as heavy rains flooded streets and caused a… pic.twitter.com/LwwhQtnlbg
— SANTINO (@MichaelSCollura) April 16, 2024