Leading News Portal in Telugu

Dubai Rains: భారత్‌-దుబాయ్‌ మధ్య విమాన సర్వీస్‌లు రద్దు.. ఎప్పటివరకంటే..!



Flites

ఎడారి దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మునుపెన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింంది. భారీ ఎదురుగాలులు, వడగండ్ల వర్షంతో దుబాయ్‌ను అతలాకుతలం చేసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. భారీ ప్రవాహనికి కార్లు, బైకులు, వస్తువులు కొట్టుకుపోయాయి. పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ఇళ్లు మునిగిపోయాయి. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. ఇక ఎయిర్‌పోర్టులోకి వర్షపునీరు చేరిపోవడంతో విమానాలు కూడా మునిగిపోయాయి. పెద్ద ఎత్తున రోడ్లు కోతకు గురయ్యాయి. ఏడాది వర్షమంతా ఒక్క మంగళవారమే కొన్ని నిమిషాల్లో కురిసి బెంబేలెత్తించింది.

ఇది కూడా చదవండి: Thangalaan: ఇదే కదా కావాల్సింది.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న తంగలాన్ గ్లింప్స్

ఇదిలా ఉంటే భారీ వర్షాలు దుబాయ్‌ను అతలాకుతలం చేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై వర్షపునీరు నిలిచిపోవడంతో 28 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సివిల్‌ ఏవియేషన్‌ శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి దుబాయ్‌ వెళ్లే 15 విమానాలు.. అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. వీలైనంత వేగంగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్‌ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు.

ఇది కూడా చదవండి: Moto G64 5G: భారత్ మార్కెట్ లోకి మోటో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వ్యాప్తంగా మంగళవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీళ్లలోనే ఉన్నాయి. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే బుధవారం కూడా వడగండ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. గంటలోపే 254 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పొరుగున ఉన్న ఒమెన్‌లో కూడా భారీ వరదలు కారణంగా పాఠశాల విద్యార్థుల సహా 19 మంది చనిపోయారు. ఇక రోడ్లపై నిలిచిపోయిన వాటర్‌ను తొలగించేందుకు మోటర్లు ఉపయోగిస్తున్నారు. ఇక విమానాలు, రైళ్లు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వేగంగానే పరిస్థితుల్ని చక్కదిద్దుతామని అధికారులు చెబుతున్నారు.