Leading News Portal in Telugu

Earthquake: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో భూకంపం.. ప్రజలు బెంబేలు


అమెరికాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం లాస్ ఏంజిల్స్ మరియు దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. నష్టం జరిగినట్లుగా ఎలాంటి సమాచారం అందలేదు. బేకర్స్‌ఫీల్డ్, శాన్ డియాగో మరియు జాషువా ట్రీ నేషనల్ పార్క్‌లో 100 మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఈ భూకంపం సంభవించినట్లుగా అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Earthquake: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో భూకంపం.. ప్రజలు బెంబేలు

అయితే భూకంపం తర్వాత ఎలాంటి సునీమా హెచ్చరికలు జారీ చేయలేదు. మరోవైపు అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే భూప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల కిటికీల అద్దాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ భూకంపం సంభవించినట్లుగా ప్రజలు పేర్కొన్నారు. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: Off The Record : మాజీ ముఖ్యమంత్రుల మీద పోరాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు…?