Leading News Portal in Telugu

Los Angeles Earthquake: లాస్‌ఏంజిల్స్‌లో భూకంపం!


  • లాస్‌ఏంజిల్స్‌లో భూకంపం
  • 4.7 తీవ్రతతో ప్రకంపనలు
  • ధ్వంసమైన సామాన్లు
Los Angeles Earthquake: లాస్‌ఏంజిల్స్‌లో భూకంపం!

Earthquake in Los Angeles: అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (యుఎస్‌జీఎస్) తెలిపింది. చైనాటౌన్ సమీపంలోని హైలాండ్ పార్క్‌కు దక్షిణ ఆగ్నేయంగా 2.5 మైళ్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది.

స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12:20 గంటలకు భూకంపం సంభవించింది. లాస్‌ఏంజిల్స్‌ ప్రాంతం నుంచి మెక్సికో సరిహద్దులోని శాన్‌డియాగో వరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలు ఇళ్లలోని అద్దాలు, సామాన్లు ధ్వంసమయ్యాయి. భూకంపం తర్వాత లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.