- పాక్ పార్లమెంట్‌లో ఎలుకలు..
-
పట్టుకునేందుకు పిల్లుల ఏర్పాటు.. -
పిల్లుల కోసం ఏకంగా లక్షల్లో ఖర్చు.. -
ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇలాంటి ఖర్చు ఎందుకని ప్రశ్నలు..

Pakistan: ఆర్థిక సంక్షోభంలో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజలకు తిందామంటే గోధుమ పిండి దొరకని పరిస్థితి ఉంది. అయితే, ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రభుత్వం ఎలుకలను పట్టేందుకు లక్షల్లో డబ్బు ఖర్చు చేయడాన్ని అక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ పార్లమెంట్ హౌజులో ఎలుకల సంచారం పెరగడంతో వాటిని అరికట్టేందుకు, పిల్లులను రంగంలోకి దించారు. దీని కోసం పాక్ ప్రభుత్వం ఏకంగా రూ. 1.2 మిలియన్లనను కేటాయించింది.
తీవ్ర ఆర్థిక మాంద్యం, రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్భణం, ఉగ్రవాదం ఇలా అనేక సవాళ్లతో పాకిస్తాన్ కాల వెళ్లదీస్తోంది. ఈ సమయంలో పిల్లులపై పెట్టిన ఖర్చు గురించి పాకిస్తాన్ మీడియా కథనాలను ప్రచురిస్తున్నాయి. క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ (CDA) పార్లమెంటు ప్రాంగణంలో ఎలుకల సమస్యను పరిష్కరించడానికి వేట కోసం పిల్లలను ఏర్పాటు చేసింది.
క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ బెయిలౌట్‌లపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రజలు నిత్యావసర వస్తువులకు దూరయ్యారు. 1958 నుంచి ఇప్పటి వరకు 22 సార్లు పాకిస్తాన్ బెయిలౌట్లకు దారి తీసింది. ప్రస్తుతం ఆ దేశ అప్పులు 6.28 బిలియన్ డాలర్లుగా ఉంది. విదేశీ సాయం, గ్రాంట్లపై ఎక్కువగా ఆధారపడిటం పాక్ ఆర్థిక వ్యవస్థని దారుణంగా దెబ్బ తీసిందని నిపుణులు చెబుతున్నారు.