- షేక్ హసీనా దేశం విడిచి వెళ్లినా ఆగని నిరసనలు
- తాజాగా మళ్లీ బంగ్లాలో నిరసనల సెగ
- దేశానికి తీసుకొచ్చి అవినీతిపై విచారించాలని డిమాండ్

నిరసనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లారు.. మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినా.. దేశంలో ప్రజల ఆగ్రహం చల్లారడం లేదు. బంగ్లాదేశ్లో విద్యార్థులతో సహా ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు. షేక్ హసీనాను భారతదేశం నుంచి తిరిగి బంగ్లాదేశ్ కి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్లో విచారించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఉరితీయాలని నినాదాలు చేస్తున్నారు. షేక్ హసీనా తమపై ఆరోపణలు చేశారని.. అయితే హసీనా ఎంతో అవినీతికి పాల్పడిందని ఓ విద్యార్థి ఆరోపించారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్ కి పంపాలని భారత ప్రధానిని కోరుకుంటున్నామన్నారు.
READ MORE:Lucky Baskhar: దీపావళికి లక్కీ భాస్కర్ దిగుతున్నాడు!
కేవలం అవినీతిపైనే మా పోరాటం అని విద్యార్థి ఆందోళనకారులు చెబుతున్నారు. “మేము ఇంతకు ముందు కూడా హిందువులతో కలిసి జీవించాం. ఇప్పుడు కూడా కలిసే ఉంటాం.” అని నిరసన కారులు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై హింస నేపథ్యంలో.. ఇటీవల మొహమ్మద్ యూనస్ హిందువుల భద్రతకు పూర్తి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు మాజీ ప్రధాని పాలనపై తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ముహమ్మద్ యూనస్ ఆదివారం మాట్లాడుతూ.. “షేక్ హసీనా పాలన క్రూరమైంది. నియంతృత్వాన్ని ఆమె అవలంబించింది. ఒకటిన్నర దశాబ్దాల పాలనలో దేశంలోని ప్రతి సంస్థను నాశనం చేసింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని స్పష్టంగా తెలుస్తోంది.” అని పేర్కొన్నారు.
READ MORE: Vande bharat train: వందే భారత్ రైల్లో కలుషిత ఆహారం.. పప్పులో బొద్దింక ప్రత్యక్షం
కాగా.. బంగ్లాదేశ్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో 300 మందికిపైగా మృత్యువాత పడగా.. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. ఆ తర్వాత మరింత ఉద్ధృతమై చివరికి హింసాత్మకంగా మారడంతో.. ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగి.. ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో.. షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి పరారయ్యారు.