Leading News Portal in Telugu

Imran Khan: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ దరఖాస్తు


  • ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ దరఖాస్తు

  • గతంలో బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఛాన్సలర్‌గా 8 ఏళ్లు విధులు

  • ప్రస్తుతం ఏడాది నుంచి పాక్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్
Imran Khan: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ దరఖాస్తు

పాకిస్థాన్ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (71) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సలహాదారు సయ్యద్ బుఖారీ ధృవీకరించారు. ఏడాదికి పైగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆదివారం రాత్రి గడువు కంటే ముందే దరఖాస్తును సమర్పించినట్లు వెల్లడించారు. అందరి మద్దతు కోసం ఎదురు చూస్తున్నట్లు బుఖారీ ట్వీట్ చేశారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సరికొత్త విధానానికి తెర లేపింది. ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అప్లై చేసుకునేలా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఓల్డ్ స్టూడెంట్ అయిన ఇమ్రాన్‌ఖాన్ ఛాన్సలర్ పదవికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ మేరకు పాక్ మీడియా కూడా ధ్రువీకరించింది. ఈ పదవికి అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: CM Chandrababu: అమరావతికి రూ.15వేల కోట్లు.. చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధుల భేటీ

ఛాన్సలర్‌ పదవికి ఓల్డ్ స్టూడెంట్స్, ఉద్యోగులంతా పోటీ చేయొచ్చు. ఇమ్రాన్‌ఖాన్‌ 1970లో ఆక్స్‌ఫర్డ్‌లోని తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం చదివి పట్టభద్రుడయ్యాడు. గతంలో ఆయన బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి ఎనిమిదేళ్లు ఛాన్సలర్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. నామినేషన్ల దాఖలుకు ఆదివారంతో గడువు ముగిసింది. అక్టోబర్‌లో అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామని విశ్వవిద్యాలయం వెల్లడించింది. అక్టోబర్‌ 28వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్‌ ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

ఇది కూడా చదవండి: Minister Atchannaidu: ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు.. వ్యవసాయ మంత్రి కీలక ఆదేశాలు

ఇక ఇమ్రాన్‌ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియా జైలులో ఉన్నారు. తోషఖానా, సైఫర్‌, ముస్లిం వ్యతిరేక వివాహం తదితర కేసులకు సంబంధించి దాదాపు ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన భార్య బుర్షా బీబీ కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్‌పై దాదాపు 200కి పైగా కేసులు ఉన్నాయి. ఇమ్రాన్ 2018 నుంచి 2022 వరకు పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఉన్నారు. అవినీతి నుంచి హింసను ప్రేరేపించడం వరకు వివిధ ఆరోపణలపై సంవత్సరం నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Lucky Baskhar: దీపావళికి లక్కీ భాస్కర్ దిగుతున్నాడు!