
Russia Ukraine War : ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ లోపల భారీ దాడిని ప్రారంభించింది. సోమవారం ఉదయం, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా అనేక నగరాల్లో పేలుళ్లు వినిపించాయి.. పొగలు వ్యాపించాయి. ఉక్రెయిన్‌లోని అనేక నగరాల్లో వైమానిక దాడి, క్షిపణి సైరన్‌లు మోగుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యం ఇటీవల రష్యాపై పలు దాడులు నిర్వహించగా, తాజాగా సరతోవ్‌లోని 38 అంతస్తుల భవనంపై దాడి చేసింది. దీనికి రష్యా కూడా ప్రతీకారం తీర్చుకుంది. అనేక ఉక్రేనియన్ నగరాలపై రష్యన్ సైన్యం అనేక గైడెడ్ క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ జెట్‌లతో దాడి చేసింది.
రాజధానిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని కైవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు. దీంతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ఖార్కివ్ మేయర్ మేయర్ ఇహోర్ తెరెఖోవ్ కూడా ఇదే విధమైన సమాచారం ఇచ్చారు. దాడులకు భయపడి, ఉక్రెయిన్ పౌరులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మెట్రోలలో ఆశ్రయం పొందుతున్నారు.
#BREAKING 🇷🇺🇺🇦 Kyiv airport was struck moments ago, along with literally every other city. pic.twitter.com/q9zxcZyje8
— Heyman_101 (@SU_57R) August 26, 2024
ప్రతీకారం తీర్చుకుంటున్న రష్యా
ఉక్రేనియన్ సైన్యం కుర్స్క్‌ను ఆక్రమించినందుకు రష్యా ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించిందని రష్యా సైన్యం దాడుల నుండి స్పష్టమైంది. ఒడెస్సా, విన్నిట్సియా, జపోరిజియా, క్రెమెన్‌చుక్, డ్నిప్రో, ఖ్మెల్నిట్స్కీ, క్రోపివ్‌నిట్స్‌కీ, క్రివీ రిహ్, లుత్స్క్‌లతో సహా అనేక ఉక్రేనియన్ నగరాలపై రష్యా దళాలు దాడులు ప్రారంభించాయి. ఉత్తర-పశ్చిమ ఉక్రెయిన్‌లోని లుట్స్క్ నగర మేయర్ ఇహోర్ పోలిష్‌చుక్ మాట్లాడుతూ.. భవనంపై దాడిలో గాయపడిన మహిళ మరణించినట్లు సమాచారం.
రష్యాపై 9/11 తరహా దాడి
రష్యా సరిహద్దుకు 2300 కిలోమీటర్ల దూరంలోని సరాటోవ్‌లోని 38 అంతస్తుల భవనంపై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది. ఈ దాడి తరువాత, నగరం మొత్తం భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడిని అమెరికా 9/11 దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ దాడి ఉక్రెయిన్ సైన్యం సామర్థ్యాలను బహిర్గతం చేసింది. వారు రష్యా సరిహద్దులో వేల కిలోమీటర్ల దూరంలో కూడా దాడి చేయగలరని నిరూపించారు.